Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే'

ఇదిలా ఉంటే దర్శకుడిగానే కాకుండా నిర్మాతగాను పలు సినిమాలు నిర్మించిన మారుతి తాజాగా తన నిర్మాణ సంస్థలో రాబోతున్న కొత్త ప్రాజెక్టును ప్రకటించారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 8:16 AM GMT
రాజ్ తరుణ్ భలే ఉన్నాడే
X

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న దర్శకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మారుతి. ముఖ్యంగా యూత్ ని దృష్టిలో ఉంచుకుని ఆయన తెరకెక్కించే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. మొన్నటి దాకా యంగ్, మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే దర్శకుడిగానే కాకుండా నిర్మాతగాను పలు సినిమాలు నిర్మించిన మారుతి తాజాగా తన నిర్మాణ సంస్థలో రాబోతున్న కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. యంగ్ యాక్టర్ రాజ్ తరుణ్ హీరోగా మారుతి టీం ప్రొడక్ట్స్ సమర్పణలో రవి కిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ కుమార్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోంది. గీతా సుబ్రహ్మణ్యం, పెళ్లి, హలో వరల్డ్ వంటి పలు విజయవంతమైన వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన జె. శివ సాయి వర్ధన్ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నాడు.

సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'భలే ఉన్నాడే' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాజ్ తరుణ్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో రాజ్ తరుణ్ 'రాధా' అనే పాత్రను పోషిస్తున్నట్లు ఈ పోస్టర్లో పేర్కొన్నారు. పోస్టర్ ని బట్టి చూస్తే సినిమాలో రాజ్ తరుణ్ ప్రొఫెషనల్ సారీ డిజైనర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక పోస్టర్ బ్యాగ్రౌండ్ లో. ఆడవాళ్లకి సంబంధించిన పువ్వులు, మేకప్ వస్తువులు లాంటివి గమనించవచ్చు. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తి పెంచారు మేకర్స్. మనీషా కంద్కుర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుండగా.. లెజెండరీ ఫిలిం మేకర్ సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అభిరామి, లీల, శాంసన్, అమ్ము అభిరామి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నగేష్ బానేళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, శివకుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.