తీహార్ జైలుకు 'కిక్2' నటుడు ఏం జరిగింది?
ఈ మధ్య బాలీవుడ్ నటీనటులు, డైరెక్టర్లు, చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల టైమ్ బాగాలేనట్టుంది. వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 6 Feb 2026 11:57 AM ISTఈ మధ్య బాలీవుడ్ నటీనటులు, డైరెక్టర్లు, చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల టైమ్ బాగాలేనట్టుంది. వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వరుస కాల్పుల ఘటనలతో సల్మాన్ ఖాన్, దిషా పటానీ, కంగన నరౌత్, రోహిత్ శెట్టి ఇప్పటికే వార్తల్లో నిలవగా తాజాగా మరో నటుడు రాజ్ పాల్ యాదవ్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. అయితే తను వార్తల్లో నిలిచింది చెక్ బౌన్స్ కేసులో కావడం గమనార్హం. గత కొంత కాలంగా రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో సతమతమవుతున్నాడు. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.
ఈ నెల 2నే సరెండర్ కావాలని న్యాయస్థానం ఇటీవల ఆదేశించగా..గడువు పెంచాలని నటుడు కోరారు. దానిని తప్పుపట్టిన హైకోర్టు లొంగిపోవాలని బుధవారం అదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలనుసారం రాజ్ పాల్‌యాదవ్ గురువారం సాయంత్రం లొంగిపోయారు. రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కోవడానికి కారణం ఏంటీ? అసలు అతని చుట్టూ ఏం జరిగింది? అని ఆరా తీస్తే ఆస్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. రాజ్‌పాల్ యాదవ్ ఆయన భార్యపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది.
తమ వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోగా..వారు ఇచ్చిన కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయని సదరు సంస్థ ఫిర్యాదు చేసింది. ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్‌పాల్ దంపతులను 2018లో తోషులుగా తేల్చి నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2019లో సెషన్స్ కోర్టు కూడా శిక్షను సమర్దించింది. దీనిని సవాల్ చేస్తూ రాజ్‌పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ శిక్షపై 2024లో తాత్కాలిక స్టే ఇస్తూ రాజీపడాలని సూచించింది. ఫిర్యాదు దారుడికి డబ్బు తిరిగి చెల్లిస్తానని నటుడు కోర్టుకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో తాజాగా తుది ఆదేశాలు జారీ చేసింది.
రాజ్‌పాల్ యాదవ్ `హంగామా`, షాదీసే పహెలే, భూల్ భులయ్య, డ్రీమ్ గర్ల్ 2, బేబీజాన్ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించిచాడు. కమెడియన్‌గా తనదైన ముద్ర వేశాడు. బాలీవుడ్‌లో ప్రముఖ స్టార్లతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. హిందీతో పాటు రాజ్‌పాల్ యాదవ్ మరాఠీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించాడు. తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన `కిక్2` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంత్రీ ఇచ్చారు.
