Begin typing your search above and press return to search.

రజినీకాంత్.. ఆ సిస్టమ్ పై పవర్ఫుల్ మూవీ

మూవీ 1980-90 మధ్యకాలంలో జరిగే కథాంశంగా ఉంటుందంట. ఇండియాలోకి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రవేశించి మెల్లగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం మొదలైన తరంలో కథ నడుస్తుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:35 AM GMT
రజినీకాంత్.. ఆ సిస్టమ్ పై పవర్ఫుల్ మూవీ
X

సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన లాల్ సలామ్ చిత్రంలో గెస్ట్ రోల్ చేశాడు. ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది. రజినీకాంత్ ఇమేజ్ కూడా మూవీని సేవ్ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో రజినీకాంత్ మూవీ చేస్తున్నారు.

ఈ మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అమితాబచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ మూవీలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథకి సంబంధించి ఇంటరెస్టింగ్ టాక్ బయటకొచ్చింది.

మూవీ 1980-90 మధ్యకాలంలో జరిగే కథాంశంగా ఉంటుందంట. ఇండియాలోకి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రవేశించి మెల్లగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం మొదలైన తరంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో లోపాలపై ఎలాంటి పోరాటం చేశారనేది ఈ మూవీ కథగా జ్ఞాన్ వేల్ చెప్పబోతున్నారు అనే ప్రచారం నడుస్తోంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేపథ్యంలో చాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి.

ధనుష్ తెలుగులో చేసిన సర్ మూవీ కూడా కార్పొరేట్ కాలేజీల నేపథ్యంలోనే తెరకెక్కిన కథాంశమే. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. సోషల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి చెప్పే ఎలాంటి సినిమాలకి ఎప్పుడూ కూడా ఆధారణ ఉంటుంది. హీరో ఇమేజ్ బట్టి చెప్పాలనుకున్న అంశం ఎక్కువ రీచ్ ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కాబట్టి కచ్చితంగా సినిమా పాన్ ఇండియా స్థాయిలో అందరికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దీని తర్వాత రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో మూవీ చేస్తున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రం కూడా తెరకెక్కనుంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.