అమీర్ ఖాన్‌నే రీప్లేస్ చేసిన నటుడు?
నటుడు రాజ్ కుమార్ రావు వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. అతడు కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.
By: Tupaki Desk | 21 April 2025 4:43 PMనటుడు రాజ్ కుమార్ రావు వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. అతడు కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. లక్షలలో మొదలై ఇప్పుడు కోట్లలో పారితోషికం అందుకునే రేంజుకు ఎదిగాడు. ఒక్కో సినిమాకి అతడు రూ.5 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ఈ ఏడాది లో విడుదలై బంపర్ హిట్ కొట్టిన స్త్రీ 2 లో తన పాత్ర కోసం అతడు ఇంత పెద్ద మొత్తాన్ని అందుకున్నాడు. అతడికి మడాక్ ఫిలింస్ అధినేత దినేష్ విజన్ కెరీర్ ఆరంభం నుంచి అండగా నిలుస్తున్నారు. మడాక్ ఫిలింస్ లో తనకు దక్కిన మొదటి అవకాశం చాలా చిన్నది అని, కానీ ఆ తర్వాత తమ మధ్య చాలా జరుగుతుందని ఊహించలేదని రాజ్ కుమార్ రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ప్రారంభంలో అతడికి ఇంత పెద్ద బ్యానర్ లో చిన్న పాత్రలో అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు ఇదే బ్యానర్ లో భారీ చిత్రాల్లో అతడికి అవకాశాలొస్తున్నాయి. స్త్రీ 2తో ఐదు కోట్ల రేంజులో పారితోషికం అందుకున్న రాజ్ కుమార్ రావు తదుపరి ఓ బయోపిక్ కోసం అంతకుమించి అందుకోబోతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాని కూడా మడాక్ ఫిలింస్ దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.
ఇది బయోపిక్ కేటగిరీ మూవీ. ప్రముఖ న్యాయవాది- పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. 2026లో ప్రారంభమయ్యే ఈ సినిమా కాస్టింగ్ ఎంపికలు ఏడాది చివరిలో ప్రారంభం కానున్నాయి. కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర కోసం రాజ్ కుమార్ రావు అవసరం మేర మేకోవర్ చూపించాల్సి ఉంటుంది.
నిజానికి ఈ చిత్రంలో నటించేందుకు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మడాక్ ఫిలింస్ తో చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు. కానీ చివరి నిమిషంలో అతడు వైదొలగడంతో, ఇదే పాత్రలోకి రాజ్ కుమార్ రావు ఎంట్రీ ఇచ్చాడు. అమీర్ ఖాన్ అంతటివాడు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్టులోకి రాజ్ కుమార్ రావు అడుగుపెట్టాడు అంటే అది అతడి అదృష్టం. అమీర్ ఖాన్ ఈ చిత్రానికి సహనిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. మడాక్ ఫిలింస్ అతడికి మరో బ్లాక్ బస్టర్ ని ఖాయం చేసిందనే భావించాలి.