Begin typing your search above and press return to search.

రూ.800 కోట్ల మూవీ హీరో తెలివి తక్కువ తనం..!

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మాలిక్‌' సినిమా మొదటి వారాంతంలో కనీసం రూ.25 కోట్ల వసూళ్లు నమోదు చేయలేక పోయింది.

By:  Tupaki Desk   |   14 July 2025 12:49 PM IST
రూ.800 కోట్ల మూవీ హీరో తెలివి తక్కువ తనం..!
X

'స్త్రీ 2' సినిమాతో వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న హీరో రాజ్‌ కుమార్‌ రావు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. రెండు నెలల క్రితం భూల్‌ చుక్‌ మాఫ్‌ సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్‌ కుమార్‌ రావు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. స్త్రీ 2 తో వచ్చిన విజయాన్ని, స్టార్‌డంను కాపాడుకునేందుకు గాను రాజ్ కుమార్‌ రావు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు, కానీ ఇప్పటి వరకు ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ దక్కలేదు. తాజాగా 'మాలిక్‌' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ కలిగించే వసూళ్లను నమోదు చేస్తుంది.

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మాలిక్‌' సినిమా మొదటి వారాంతంలో కనీసం రూ.25 కోట్ల వసూళ్లు నమోదు చేయలేక పోయింది. వీక్‌ డేస్‌లో సినిమా మినిమం వసూళ్లను రాబడుతుందనే నమ్మకం లేదు. స్త్రీ 2 సినిమాతో భారీ వసూళ్లు సాధించిన రాజ్‌ కుమార్‌ రావు నటించిన సినిమా అయినప్పటికీ కంటెంట్‌ విషయంలో చాలా పేలవంగా, వీక్‌ పాయింట్స్‌తో సినిమా సాగడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ చాలా మంది చాలా రకాలుగా సినిమాపై నెగటివ్‌ కామెంట్స్ చేశారు. సినిమాకు వచ్చిన నెగటివ్‌ కామెంట్స్‌తో వసూళ్లు కూడా అదే స్థాయికి పడి పోయాయి. అన్ని విధాలుగా సినిమా నిరాశ పరిచింది.

ఒక హిట్‌ పడ్డ సమయంలో ప్రేక్షకులు ఆ హీరో నుంచి లేదా దర్శకుడి నుంచి అదే స్థాయి కంటెంట్‌ను ఆశిస్తారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోతే ఘోరమైన ఫ్లాప్‌ను చవి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి మాలిక్‌ సినిమాకు ఏర్పడింది. మాలిక్‌ సినిమా ప్రమోషన్ సమయంలో హైప్ క్రియేట్‌ చేశారు. కానీ తీరా చూస్తే సినిమాలో మ్యాటర్‌ లేదు, ఇలాంటి సినిమాను రాజ్‌ కుమార్‌ రావు ఎలా ఒప్పుకున్నాడు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కథను ఎంపిక చేసుకోవడం అనేది ఖచ్చితంగా హీరో తెలివి తక్కువ తనానికి నిదర్శనం అంటూ కొందరు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్‌ కుమార్‌ రావు ఇకపై అయినా కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన ఫ్యాన్స్‌ సూచిస్తున్నారు.

1980 టైమ్ జోన్‌లో సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. దీపక్‌ అనే వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు అనుకోని సంఘటనల కారణంగా హింసాత్మక జీవితంలోకి ఎలా మలుపు తీసుకున్నాడు అనేది కథ. తన తండ్రి పొలాన్ని అక్రమంగా తీసుకున్న ఒక రౌడీని చంపడం ద్వారా దీపక్‌ అండర్ వరల్డ్‌లో అడుగు పెడతాడు. తనకు తెలియకుండానే తాను పెద్ద అండర్‌ వరల్డ్‌ డాన్‌గా మారిపోతాడు. దీపక్ కాస్త మాలిక్‌గా మారి పోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథాంశం. ఒక అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యంను స్థాపించిన మాలిక్‌ చివరకు ఏం అవుతాడు అనేది దర్శకుడు చూపించాలని అనుకున్నాడు. కానీ కథనం విషయంలో ఫెయిల్‌ అయ్యాడు. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అదే తరహాలో ఈ కథను చూపించడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అందుకే మొదటి మూడు రోజుల్లోనే థియేటర్లన్నీ ఖాలీగా కనిపిస్తున్నాయి.