Begin typing your search above and press return to search.

భ‌గ‌త్ సింగ్ పాత్రకి అత‌ను రెడీ..డైరెక్ట‌ర్లు సిద్ద‌మేనా?

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు 'భ‌గత్ సింగ్' జీవితం ఆధారంగా ఇప్ప‌టికే ప‌లు సినిమాలు తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Aug 2023 6:16 AM GMT
భ‌గ‌త్ సింగ్ పాత్రకి అత‌ను రెడీ..డైరెక్ట‌ర్లు సిద్ద‌మేనా?
X

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు 'భ‌గత్ సింగ్' జీవితం ఆధారంగా ఇప్ప‌టికే ప‌లు సినిమాలు తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. భ‌గత్ సింగ్ పాత్ర ఎవ‌రు పోషించిన అదో చాలెంజింగ్ రోల్. అంతే ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. ఆ పాత్ర‌లో న‌టించిన వారు స‌క్సెస్ అయ్యారా? లేదా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే తాజాగా భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లో న‌టించ‌డానికి బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రాజ్ కుమార్ రావు రెడీగా ఉన్నారు. భ‌గత్ సింగ్ జీవిత చ‌రిత్ర‌పై తానెంతో ఆస‌క్తిగా ఉన్నారో తాజాగా రివీల్ చేసారు. నాకు భ‌గ‌త్ సింగ్ అంటే చాలా ఇష్టం.

గౌర‌వం..ఆయ‌న గొప్ప‌త‌నాన్ని తెర‌పై మ‌రింత లోతుగా చూపించాలి. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న జీవితంపై కొన్ని సినిమాలొ చ్చాయి. వాటికి భిన్నంగా ఓ సినిమా చేయ‌డానికి నేను సిద్దంగా ఉన్నాను. అలాంటి అవ‌కాశం నాకొస్తే జీవితంలో మ‌ర్చిపోలేని ఓ పాత్ర చేసాన‌నే తృప్తి మిగులుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా ర‌కాల పాత్ర‌లు పోషించాను. కానీ ఈ పాత్ర చాలా స్పెష‌ల్ గా ఉంటుంద‌ని భావిస్తున్నా. ఒక‌వేళ సినిమా చేస్తే భ‌గ‌త్ సింగ్ లా మార‌డానికి స‌మ‌యం తీసుకుంటా. ఎందుకంటే అది చాలా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌.

అందులో న‌టించ‌డం ఓ సాహ‌సంగానే భావిస్తా. గ‌తంలో సుభాష్ చంద్ర బోస్ పాత్ర పోషించా. 'బోస్ డెడ్ ఆర్ అలైవ్' అనే సినిమాలో ఆయ‌న పాత్ర పోషించ‌డం గొప్ప గౌర‌వం గా భావించా. ఆ త‌ర్వాతా వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా చాలా సినిమాలు చేసాను. కానీ భ‌గ‌త్ సింగ్ లాంటి పాత్ర రాలేదు. అలాంటి పాత్ర వ‌స్తే విడిచిపెట్ట‌ను' అని అన్నారు.

రాజ్ కుమార్ రావ్ లాంటి న‌టుడు తానే స్వ‌యంగా ముందుకు రావ‌డం విశేషం. ఆయ‌న న‌ట‌న‌కు దేశ వ్యాప్తంగా ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. నేచుర‌ల్ పెర్పార్మ‌ర్. ఎన్నో వైవిథ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. అలాంటి న‌టుడు నేను రెడీగా ఉన్నాను..భ‌గ‌త్ సింగ్ క‌థ‌ని తీసుకురండి? అని డైరెక్ట‌ర్ల‌కు ఓపెన్ గానే ఆఫ‌ర్ ఇచ్చారు. మ‌రి ఈ అవ‌కాశం ఏ మేక‌ర్ స‌ద్వినియోగం చేసుకుంటారో చూద్దాం.