Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ ని దింపేసిన నేచుర‌ల్ పెర్పార్మ‌ర్!

మోష‌న్ పోస్ట‌ర్ లో రాజ్ కుమార్ రావు అలా ప‌రిగెత్తుకుంటూ రావ‌డం...శ్రీకాంత్ ఎక్స్ ప్రెష‌న్స్ ప్ర‌తీది హైలైట్. ఇలాంటి పాత్ర‌ల్లో రాజ్ కుమార్ న‌టిస్తాడు?

By:  Tupaki Desk   |   5 April 2024 11:30 PM GMT
శ్రీకాంత్ ని దింపేసిన నేచుర‌ల్ పెర్పార్మ‌ర్!
X

బాలీవుడ్ లో బ‌యోపిక్ ల‌కు తిరుగులేదు. వాస్త‌వ క‌థ‌లో సోల్ ఉంటే చాలు బాక్సాఫీస్ వ‌ద్ద పంట‌పండిన‌ట్లే. అందుకే హిందీలో బ‌యోపిక్ లు తెర‌కెక్కించ‌డం అన్న‌ది ఓ అల‌వాటుగా మారిపోయింది. ప్ర‌స్తుతం దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజుపేయి జీవితం అధారంగా 'అట‌ల్' అనే చిత్రం తెర‌కెక్కుతుంది. అలాగే స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో 'మైదాన్' అనే మ‌రో ఇనిస్పేరేష‌న‌ల్ స్టోరీ రూపొందుతుంది. ఈ రెండు చిత్రాల‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త - బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవితం కూడా తెర‌కెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే.

'శ్రీకాంత్’ టైటిల్‌తో ఈ సినిమాని తుషార్ హీరానందానీ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ పాత్ర‌లో రాజ్ కుమార్ రావు న‌టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల అయింది. శ్రీకాంత్ ఆహార్యంలో రాజ్ కుమార్ ఒదిగిపోయాడ‌నిపిస్తుంది. అత‌డి లుక్ ఆద్యంతం ఒరిజిన‌ల్ ఫీల్ కి ఏమాత్రం త‌గ్గ‌లేదు. హెయిర్ స్టైల్ ..ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్..శ్రీకాంత్ లో అమాయ‌క‌త్వం ప్ర‌తీది దించేసాడు. శ్రీకాంత్ పాత్ర‌లో రాజ్ కుమార్ జీవించిన‌ట్లే పోస్ట‌ర్ తోనే క‌నిపిస్తుంది.

మోష‌న్ పోస్ట‌ర్ లో రాజ్ కుమార్ రావు అలా ప‌రిగెత్తుకుంటూ రావ‌డం...శ్రీకాంత్ ఎక్స్ ప్రెష‌న్స్ ప్ర‌తీది హైలైట్. ఇలాంటి పాత్ర‌ల్లో రాజ్ కుమార్ న‌టిస్తాడు? అన‌డం కంటే గొప్ప‌గా జీవిస్తాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. నేచుర‌ల్ పెర్పార్మెన్స్ లో రాజ్ కుమార్ రావు ఓ బ్రాండ్ న‌టుడు అని చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు స‌హ‌జ న‌ట‌న‌తోనే ఆ స్థాయికి చేరుకున్నాడు. శ్రీకాంత్ బయోపిక్ తో కొత్త హైట్స్ ని ట‌చ్ చేస్తాడ‌నిపిస్తుంది.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే పాజిటివ్ ఇంప్రెష‌న్ ప‌డింది. ఇక టీజ‌ర్..ట్రైల‌ర్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. అవి చూసిన త‌ర్వాత ఒరిజిన‌ల్ శ్రీకాంత్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఇందులో జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. టీ సీరిస్‌, ఛాక్‌ అండ్‌ ఛీస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందానీ సంయుక్తంగా నిర్మించారు. అన్ని ప‌నులు పూర్తి చేసి మే 10న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.