Begin typing your search above and press return to search.

రాజ్ కుమార్ హిరాణీ... నెక్స్ట్ ప్రాజెక్ట్ అక్కడే..

కలెక్షన్స్ అయితే భాగానే వస్తున్న రాజ్ కుమార్ రేంజ్ మూవీ అయితే కాదనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 4:18 AM GMT
రాజ్ కుమార్ హిరాణీ... నెక్స్ట్ ప్రాజెక్ట్ అక్కడే..
X

బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని రాజ్ కుమార్ హిరాణీ సొంతం చేసుకున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా డంకీ మూవీతో హిరాణీ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీకి అయన కెరియర్ లో మొదటి సారిగా ఎవరేజ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ అయితే భాగానే వస్తున్న రాజ్ కుమార్ రేంజ్ మూవీ అయితే కాదనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో దర్శకులు, హీరోలు అందరూ కూడా బిగ్ స్క్రీన్ నుంచి ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. సౌత్ కంటే బాలీవుడ్ లో డిజిటల్ స్పేస్ లోకి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఇది వెబ్ సిరీస్ కోసం కాదని తెలుస్తోంది. అలాగే దర్శకుడిగా కూడా ఆయన ఎంట్రీ ఇవ్వడం లేదు.

షో రన్నర్ గా ఒక డిజిటల్ షోని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది ఏ రకమైన షో అనేది క్లారిటీ ఇవ్వలేదు. స్వయంగా రాజ్ కుమార్ హిరాణీనే డిజిటల్ ఎంట్రీ గురించి కన్ఫర్మ్ చేశారు. 12th ఫెయిల్ సినిమాతో బాలీవుడ్ లోకి స్టార్ గా మారిపోయిన హీరో విక్రాంత్ మెస్సితో ఈ షో ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే షో షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోందంట.

డిస్నీహాట్ స్టార్ కోసం ఈ షో చేస్తున్నట్లు హిరాణీ చెప్పారు. ఈ షోకోసం తాను పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయినట్లు చెప్పారు. కచ్చితంగా ఈ షో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో హిరాణీ మున్నాభాయ్ సిరీస్ లో రెండు సినిమాలు చేశారు. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. సంజయ్ దత్, అర్షద్ వర్షీ లీడ్ రోల్ చేశారు. మున్నాభాయ్ ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆలోచన తన మైండ్ లో ఉందని తాజాగా ఆయన తెలిపారు.

అయితే ఏదో మున్నాభాయ్ ఫ్రాంచైజ్ కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో క్యాష్ చేసుకోవడానికి చెప్పడంలేదని, కచ్చితంగా ఈ సిరీస్ లో పార్ట్ 3కి సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయినపుడే సినిమా చేస్తానని చెప్పారు. దానికోసం టైం తీసుకుంటా అని అన్నారు.