Begin typing your search above and press return to search.

విక్ర‌మ్ కి యాక్టింగ్ రాదు అనేసిన దేవ‌యాని భ‌ర్త‌!

తాజాగా విక్ర‌మ్ పై రాజ‌కుమార‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. 'చేయి విరగగొట్టినట్లుగా.. కాలు విరగగొట్టినట్లుగా, ఒక కన్ను కప్పినట్లుగా నటించడం నిజమైన నటన కాదు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 8:03 AM GMT
విక్ర‌మ్ కి యాక్టింగ్ రాదు అనేసిన దేవ‌యాని భ‌ర్త‌!
X

చియాన్ విక్ర‌మ్ ఎంత గొప్ప న‌టుడు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. దేశం మెచ్చిన నటుల్లో విక్ర‌మ్ ఒక‌రు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడు. విభిన్న పాత్ర‌ల‌కు పెట్టింది పేరుగా విక్ర‌మ్ ఖ్యాతికెక్కారు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్..ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి దిగ్గ‌జాల స‌ర‌స‌న స్థానం ఎవ‌రిదంటే? క‌చ్చితంగా విక్ర‌మ్ పేరు సూచిస్తారు. అలాంటి న‌టుడ‌పై నటి దేవ‌యానిభ‌ర్త‌..ద‌ర్శ‌కుడు రాజకుమార‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.


అయితే రాజ్ కుమారన్ కూడా విక్ర‌మ్ ని ఓ సినిమాతో డైరెక్ట్ చేసాడు. ఆ సినిమానే విన్నుకుం మన్నుకుమ్‌'. అందులో దేవ‌యానికి కూడా న‌టించింది. తాజాగా విక్ర‌మ్ పై రాజ‌కుమార‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. 'చేయి విరగగొట్టినట్లుగా.. కాలు విరగగొట్టినట్లుగా, ఒక కన్ను కప్పినట్లుగా నటించడం నిజమైన నటన కాదు. మంచి నటుడు అలాంటి వాటిపై ఆధారపడ కుండా భావోద్వేగాలను వ్యక్తపరచాలి.

ముఖ్యంగా క్లోజప్ షాట్‌ల సమయంలో విక్రమ్ అలాంటి నటనను స‌వ్యంగా కూడా చేయ‌లేడు. అందుకే విక్రమ్ గొప్ప నటుడని నేను అనుకోను. అతను కమల్ హాసన్ లేదా రజనీకాంత్ ను అనుకరిస్తాడు. అంతే కాదు ఎలా నటించాలో? అతనికి తెలియదు. విక్ర‌మ్ ఏదైనా భిన్నంగా ప్రయత్నించినట్లయితే అతను తన రూపాన్ని మార్చుకుంటాడు. మీసాలు పెంచడం..గుండు గీయించుకోవ‌డం ఇలా ఆహార్యాల ప‌రంగా మార్పులు చేసి న‌ట‌న‌ని మ్యానేజ్ చేస్తాడు త‌ప్ప అత‌ని మ‌న‌సులోతుల్లో నుంచి న‌ట‌న రాదు' అని అన్నారు.

అలాగే క్లోజ్-అప్ షాట్‌లలో.. ఎలాంటి ప్రత్యేక మేకప్ లేదా విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా, విక్రమ్ నమ్మశక్యం కాని ప్రదర్శనలు ఇవ్వలేడు. మేకప్ - స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండా విక్రమ్ ఆకట్టుకోలేకపోయాడని విమ‌ర్శిం చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. విక్ర‌మ్ ని అంతా గొప్ప న‌టుడిగా కీర్తిస్తున్న స‌మ‌యంలో రాజ‌కుమార‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం విక్ర‌మ్ అభిమానుల్లో ఆగ్ర‌హానికి గురిచేసిన‌ట్లు అయింది.