ఆ స్టార్ హీరో డబ్బు మనిషి..!
బాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాజీవ్ రాయ్ సుదీర్ఘ కాలం తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
By: Tupaki Desk | 28 July 2025 1:39 PM ISTబాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాజీవ్ రాయ్ సుదీర్ఘ కాలం తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 'జోరా' అనే సినిమాను రూపొందించిన రాజీవ్ రాయ్ ఈ ఏడాది ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో పలు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన రాజీవ్ రాయ్ కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ మధ్య ఒక సినిమాకి రచన, స్క్రీన్‌ప్లే సహకారం అందించాడనే వార్తలు వచ్చాయి. దర్శకుడిగా రాజీవ్ రాయ్ రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజులుగా భావించి ఎట్టకేలకు జోరా సినిమా తో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ఈ సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు రాజీవ్ రాయ్ రూపొందించిన జోరా సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిలిచేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం దర్శకుడు రాజీవ్ రాయ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పెద్దగా సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు, సినిమా గురించి సోషల్ మీడియాలోనూ మాట్లాడుకోవడం లేదు. ఇలాంటి సమయంలో ఒక స్టార్ హీరో గురించి రాజీవ్ రాయ్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఒక్కసారిగా పబ్లిసిటీ దక్కింది. అదే సమయంలో జోరా సినిమా గురించి, సినిమా కంటెంట్ గురించి చర్చ జరుగుతోంది. జోరా సినిమాకు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు హెల్ఫ అయ్యాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇంతకు దర్శకుడు రాజీవ్ రాయ్ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే... చాలా సంవత్సరాల క్రితం రాజీవ్ రాయ్ 'మొహ్రా' అనే సూపర్ హిట్ మూవీని తీశాడు. ఆ సినిమాలో పలువురు నటీ నటులు నటించారు. మోహ్రాలో అప్పట్లో అక్షయ్ కుమార్ నటించాడు. అక్షయ్ అప్పుడప్పుడే బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్నాడు. కెరీర్ ఆరంభంలో అక్షయ్ కుమార్ ఏడాదికి అర డజను మించి సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మోహ్రా నటించిన ఏడాదిలో అక్షయ్ కుమార్ నుంచి ఏకంగా పదికి పైగా సినిమాలు వచ్చాయి. ఆ సమయంలో ఉన్న బడ్జెట్, నటీ నటుల క్రేజ్‌ను బట్టి అక్షయ్ కుమార్ బడ్జెట్ రూ.2 లక్షలుగా దర్శకుడు రాజీవ్ రాయ్ నిర్ణయించుకున్నాడట.
సినిమా మొదలు పెట్టిన తర్వాత అక్షయ్ కుమార్ రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడట. చిన్న మొత్తం విషయంలో గొడవ ఎందుకు అనే ఉద్దేశంతో ఆ సమయంలో అక్షయ్ కుమార్ అడిగినట్లుగా ఇచ్చినట్లు రాజీవ్ రాయ్ చెప్పుకొచ్చాడు. డబ్బు విషయంలో అతడికి ఉన్న వ్యామోహం ఆ రోజు నాకు అర్థం అయింది. నేను ఇండస్ట్రీలో చాల మంది నటీనటులను చూశాను. కానీ డబ్బుపై వ్యామోహం ఆ స్థాయిలో ఎవరికీ చూడలేదు. ఆయన స్థాయికి మించి నా వద్ద పారితోషికం వసూళ్లు చేశాడని రాజీవ్ రాయ్ అన్నాడు. సినిమాలో నటించిన నటీ నటులు అందరికి వారి పాత్రలు, క్రేజ్‌ను తగ్గట్లుగా పారితోషికం ఇచ్చాను, కానీ అక్షయ్ కుమార్ పారితోషికం ఎక్కువ అయిందనే ఉద్దేశంతో రాజీవ్ రాయ్ వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లో అత్యధికంగా బాబీ డియోల్‌కి పారితోషికం ఇచ్చానని, అది రూ.30 లక్షలు అని రాజీవ్ రాయ్ సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
