Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో జ‌ర్నీ సింప్లిసిటీకా బాప్ అనిపించేలా!

కానీ ఆ త‌ర్వాత ఆయ‌న సింప్లిసిటీ గురించి తెలుసుకుని కూల్ అయ్యారు. ర‌జ‌నీకాంత్ సింపుల్ గా ప్యాంట్..ష‌ర్ట్ లో క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 March 2024 7:36 AM GMT
ఆ స్టార్ హీరో జ‌ర్నీ సింప్లిసిటీకా బాప్ అనిపించేలా!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సింప్లిసిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సాధార‌ణ బ‌స్ కండెక్ట‌ర్ సూప‌ర్ స్టార్ గా ఎదిగినా ఒదిగే ఉండాల‌ని త‌న నిరాండ‌బ‌ర‌త‌ను చాటిన సంద‌ర్భాలెన్నో. ప్రేక్ష‌కాభిమానుల‌కే అత‌డు సూప‌ర్ స్టార్. అత‌నులో అత‌ను మాత్రం ఎప్ప‌టికీ శివాజీ రావు గైక్వాడ‌నే. కోట్లాది రూపాయ‌లు పారితోషికం తీసుకుంటున్నా..ల‌గ్జ‌రీ జీవితం క‌ళ్ల ముందు ఉన్నా చాలా సాధార‌ణ జీవితాన్నే ఆయ‌న ఇష్ట‌ప‌డ‌తారు.

అత‌డి డ్రెస్సింగ్ స్టైల్...రోజువారి జీవితం ఎంతో సింపుల్ గా ప్రారంభ‌మ‌వుతుంది. అర్భాటాలు..హంగులు అంటే అస్స‌లు ఇష్టం లేని స్టార్ అత‌ను. తాజాగా ర‌జ‌నీకాంత్ మ‌రోసారి త‌న నిరాడంబ‌ర‌త‌ను చాటుకున్నారు. తలైవర్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ వీడియో నెట్టింట‌ వైరల్‌గా మారింది. బిజినెస్ క్లాస్ లో వెళ్లాల్సిన సూప‌ర్ స్టార్ ఎకాన‌మీ క్లాస్ లో ఏంటి? అంతా షాక్ అయ్యారు.

కానీ ఆ త‌ర్వాత ఆయ‌న సింప్లిసిటీ గురించి తెలుసుకుని కూల్ అయ్యారు. ర‌జ‌నీకాంత్ సింపుల్ గా ప్యాంట్..ష‌ర్ట్ లో క‌నిపిస్తున్నారు. విండో ప‌క్క సీటులో కూర్చుని ఆకాశంలో అందాల్ని ఆస్వాదిస్తూ ప్ర‌యాణిస్తున్నారు. త‌లైవార్ నిరాండంబ‌ర‌త‌ను చూసి నెటిజ‌నులు సింప్లిసిటీ కా బాప్ స్టార్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా టి.జె జ్ఞాన్ వేల్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది సెట్స్ లో ఉంది.

ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్ పోలీస్ యూనిఫాం లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆ సినిమాలో ర‌జ‌నీకాంత్ పోలీస్ పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే లొకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 171వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ప్ర‌స్త‌తం లోకేష్ ఆసినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. ఇంకా సూప‌ర్ స్టార్ పలువురు ద‌ర్శ‌కుల‌కు క‌మిట్ మెంట్లు ఇచ్చారు. వాటిని పూర్తి చేయాల్సి ఉంది.