Begin typing your search above and press return to search.

పుష్కర కాలం తర్వాత సూపర్ స్టార్‌ జోరు

కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు లేక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నష్టపోయే వారు. జైలర్ కి మాత్రం అందరికీ లాభాలు దక్కుతున్నాయి.

By:  Tupaki Desk   |   21 Aug 2023 9:09 AM GMT
పుష్కర కాలం తర్వాత సూపర్ స్టార్‌ జోరు
X

తెలుగు రాష్ట్రాల్లో తమిళ్‌ కు చెందిన పలువురు హీరోలు మంచి వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. గతంలో రజినీకాంత్ సినిమా వస్తుంది అంటూ తెలుగు స్టార్‌ హీరోల సినిమాలు సైతం సైడ్ ఇచ్చేవి. కొన్ని తమిళనాడు తో పోల్చితే ఏపీలోనే ఎక్కువ వసూళ్లు సాధించినట్లుగా టాక్ ఉంది. అలాంటి సూపర్ స్టార్‌ రోబో తర్వాత తెలుగు లో మార్కెట్ కోల్పోయాడు.

సినిమా సినిమాకు రజినీకాంత్ మార్కెట్‌ తగ్గుతూ వచ్చింది. రోబో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత సినిమాలకు మంచి బిజినెస్ జరిగినా కూడా వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. అప్పటి నుండి రజినీకాంత్‌ సినిమా ల యొక్క డబ్బింగ్ రైట్స్ రేటు తగ్గుతూనే వచ్చింది. ఏ సినిమా చేసినా కూడా ఫలితం కలిసి రాలేదు.

రజినీకాంత్‌ హీరోగా ఎట్టకేలకు పుష్కర కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. తమిళనాట రజినీ కాంత్‌ ప్రతి సినిమా మినిమం వసూళ్లు సాధిస్తూ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు లేక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నష్టపోయే వారు. జైలర్ కి మాత్రం అందరికీ లాభాలు దక్కుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రెండవ వీకెండ్ లో కూడా జైలర్ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసింది. జైలర్‌ సినిమా తో విడుదల అయిన భోళా శంకర్ సినిమా ఆకట్టుకోవడంలో విఫలం అయింది. అందుకే జైలర్ సినిమా ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో జైలర్ కే మళ్లీ తెలుగు బాక్సాఫీస్ వద్ద అగ్ర తాంబూలం లభించింది.

మొత్తానికి పుష్కర కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్‌ సినిమా సందడి చేస్తుండటంతో పాటు వసూళ్ల పరంగా జోరు కనబరుస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు రజినీకాంత్ నటించిన సినిమాలకు మళ్లీ బిజినెస్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.