Begin typing your search above and press return to search.

చెన్నై వరదల్లో మునిగిన రజినీకాంత్ నివాసం... వీడియో వైరల్!

అవును... తాజాగా వచ్చి పోయిన మిగ్జామ్ తుఫాను చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసేసింది. ఇందులో భాగంగా... రోడ్డులు, ఇల్లు వరదనీటిలో మునిగిపోయాయి.

By:  Tupaki Desk   |   8 Dec 2023 10:00 AM GMT
చెన్నై వరదల్లో మునిగిన రజినీకాంత్  నివాసం... వీడియో  వైరల్!
X

మిగ్జామ్ తుపాను ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీలో పంటలు నీటములిగి, రైతులకు భారీ నష్టాన్ని కలిగించాయి. ఈ సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ సహాయక చర్యల్లో బిజీగా ఉన్నాయి. ఈ సమయంలో తమిళనాడులోని చెన్నై నగరం నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ వరద నీటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు కూడా ఉండటం గమనార్హం!

అవును... తాజాగా వచ్చి పోయిన మిగ్జామ్ తుఫాను చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసేసింది. ఇందులో భాగంగా... రోడ్డులు, ఇల్లు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో విద్యుత్ అంతరాయం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, ఆహారం లేకపోవడంతో జన జీవనాన్ని స్తంభించిపోవడం జరిగిపోయాయి. ఈ సమయంలో వరద బీభత్సంతో కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఇందులో భాగంగా... కోలీవుడ్ స్టార్ హీరోల భవంతుల్లోకి కూడా వరద నీరు చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నివాసం కూడా ఈ వరదలతో నీటమునిగింది. ఈ సమయంలో ఒక అభిమాని రజినీకాంత్ నివాసానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో రజిని ఇల్లు పాదాలు లోతు వరద నీటిలో మునిగి కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.

కాగా... ఈ ఏడాది "జైలర్" సినిమాతో రజనీకాంత్ సౌత్ లోనే అత్యధిక పారితోషకం అందుకున్న నటుడిగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆయన దాదాపు 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఇంతటి సూపర్ స్టార్ ఇల్లు కూడా వరదల్లో మునగడంతో.. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.