Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ తో జాయిన్‌ అయిన రానా

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయన్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   4 March 2024 9:28 AM GMT
సూపర్ స్టార్‌ తో జాయిన్‌ అయిన రానా
X

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయన్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. జైలర్ సినిమా తర్వాత రజినీకాంత్‌ సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. అభిమానులు మరో అయిదు వందల కోట్ల సినిమా రాబోతుందనే నమ్మకంతో వెయిట్‌ చేస్తున్నారు.

వెట్టయన్‌ సినిమాలో కీలక పాత్రను టాలీవుడ్‌ స్టార్‌ నటుడు రానా చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఇన్ని రోజులు రజినీకాంత్ మరియు ఇతర యూనిట్‌ సభ్యుల పై మాత్రమే చిత్రీకరణ జరిపిన దర్శకుడు జ్ఞానవేల్‌ నేటి నుంచి రానా పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల అనంద్ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో పాల్గొన్న రజినీకాంత్‌ తిరిగి వచ్చారు. ఆయన హైదరాబాద్‌ కు వచ్చి వెట్టయన్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా నిన్న మొన్న తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు రానా ఆ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

తెలుగు లో హీరోగా మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ సినిమాల్లో రెగ్యులర్‌ గా విలన్ గా లేదంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రానా నటిస్తూ మెప్పిస్తూ ఉన్నాడు. రజినీకాంత్ వెట్టయన్‌ సినిమాలో రానా పాత్ర ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రజినీకాంత్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నందుకు రానా చాలా ఎగ్జైట్‌ తో ఉన్నట్లుగా ఆయన పోస్ట్ ను చూస్తే అర్థం అవుతుంది. నేడు మొదటి రోజు అంటూ రానా మెన్షన్ చేస్తూ రజినీకాంత్‌ మూవీ హ్యాష్ ట్యాగ్‌ ను పోస్ట్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

ఈ మధ్య కాలంలో రానా సినిమాలు చాలా తక్కువ అయ్యాయి. గత ఏడాదిలో ఆయన నుంచి ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రాలేదు.. వచ్చినవి కూడా పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. కనుక ఈ ఏడాదిలో అయినా రానా మెప్పిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.