Begin typing your search above and press return to search.

వీడియో: టీ అమ్ముతున్న ర‌జ‌నీకాంత్

అచ్చు గుద్దిన‌ట్టు ఇత‌డు ర‌జ‌నీకి డూప్ అన‌డంలో సందేహం లేదు. అత‌డు కొచ్చిన్‌కు చెందిన టీ అమ్మేవాడు అని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 4:52 AM GMT
వీడియో: టీ అమ్ముతున్న ర‌జ‌నీకాంత్
X

ఒక సాధార‌ణ బ‌స్ కండ‌క్ట‌ర్ హీరో అవ్వ‌డ‌మే సంచ‌ల‌నం అనుకుంటే, అంచెలంచెలుగా ఎదిగి సూప‌ర్ స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకోవ‌డం నేడు 500 కోట్ల క్ల‌బ్ హీరోగా ఎద‌గ‌డం అన్న‌ది ఒక అద్భుత చ‌రిత్ర‌.

సూపర్ స్టార్ రజనీకాంత్ కి దేశవ్యాప్తంగా భారీ అభిమానులను ఉన్నారు. అయితే ఇటీవల రజనీకాంత్ టీ అమ్ముకుంటున్నారంటూ ఓ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇది నిజ‌మేనా? అని శోధిస్తే షాకిచ్చే విష‌యం తెలిసింది. నిజానికి ఈ వీడియోలో టీ అమ్ముతున్న‌ది ర‌జ‌నీకాంత్ కాదు. అచ్చం ర‌జ‌నీకాంత్ లా ఉన్న టీ అమ్ముకునే మ‌రొక‌రు. ఈ లుక్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సంచలనం సృష్టిస్తోంది. అత‌డు చూడ‌టానికి సూపర్‌స్టార్ ర‌జ‌నీని పోలి ఉన్నాడు. అదే హెయిర్‌స్టైల్ అదే నెరిసిన గ‌డ్డం.. క‌నుచూపు ముక్కు తీరు అన్నీ అచ్చం ర‌జ‌నీకాంత్ నే పోలి ఉన్నాయి. దానికి తోడు రజనీకాంత్ సిగ్నేచర్ స్టైల్‌ను గుర్తుకు తెచ్చే దుస్తులు ధరించాడు. అంతే కాదు ఈ వీడియోలో బాడీగార్డులతో ఇంటరాక్ట్ అవుతున్నట్లు బిల్డ‌ప్ కూడా ఇచ్చారు.

అచ్చు గుద్దిన‌ట్టు ఇత‌డు ర‌జ‌నీకి డూప్ అన‌డంలో సందేహం లేదు. అత‌డు కొచ్చిన్‌కు చెందిన టీ అమ్మేవాడు అని తెలుస్తోంది. సూపర్‌స్టార్ ర‌జ‌నీతో అతని అద్భుతమైన పోలిక కారణంగా అతడు న‌గ‌రంలో బాగా పాపుల‌ర‌య్యాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ర‌జ‌నీకాంత్ ఇటీవ‌లే జైల‌ర్ తో భారీ హిట్ కొట్టాడు. త‌దుప‌రి రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ చిత్రం `లాల్ సలామ్`లో కనిపించబోతున్నారు. ఇందులో విష్ణు విశాల్ - విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 2024లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు TJ జ్ఞానవేల్‌తో త‌లైవా170లోను న‌టించాల్సి ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. 77వయ‌సులో ర‌జ‌నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు.