Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్ ఆఫ‌ర్‌ని కాద‌న్న కింగ్ ఖాన్

అయితే లోకేష్ క‌న‌గ‌రాజ్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో నేరుగా ఒక చిత్రంలో న‌టించాల‌నుంద‌ని ఖాన్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది

By:  Tupaki Desk   |   17 Dec 2023 5:58 AM GMT
ర‌జ‌నీకాంత్ ఆఫ‌ర్‌ని కాద‌న్న కింగ్ ఖాన్
X

'విక్ర‌మ్' లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రంతో లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు మార్మోగింది. ఇటీవ‌లే ద‌ళ‌ప‌తి విజ‌య్ తో తెర‌కెక్కించిన లియోకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూళ్ల‌ను సాధించింది. అంత‌కుముందు అజేయ‌మైన ట్రాక్ రికార్డ్ ఉన్న ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్.. కార్తీతో ఖైదీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించాడు. ప్ర‌స్తుతం అత‌డు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా త‌లైవ‌ర్ 171 చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

ఈ సినిమాని భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశంతో రూపొందించ‌నున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఇందులో ఓ ప్ర‌త్యేక అతిథి పాత్ర కోసం కింగ్ ఖాన్ షారూఖ్‌ని లోకేష్ సంప్ర‌దించార‌ని తెలిసింది. అయితే షారూఖ్ ఈ ఆఫ‌ర్ ని సున్నితంగా తిర‌స్క‌రించారు. ఇటీవ‌ల టైగ‌ర్ 3 - బ్ర‌హ్మాస్త్ర లాంటి చిత్రాల్లో అత‌డు అత‌థి పాత్ర‌ల్లో న‌టించాడు. కానీ వాటితో ఒరిగిందేమీ లేదు. పైగా స‌ల్మాన్ తో క‌లిసి అతిథిగా న‌టించిన 'టైగ‌ర్ 3' ఆశించిన ఫ‌లితాన్ని అందుకోక‌పోవ‌డం నిరాశ ప‌రిచింది. అదే క్ర‌మంలో ర‌జ‌నీ అతిథి పాత్ర‌లో న‌టించేందుకు ఆసక్తిని క‌న‌బ‌ర‌చ‌లేద‌ని తెలిసింది.

అయితే లోకేష్ క‌న‌గ‌రాజ్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో నేరుగా ఒక చిత్రంలో న‌టించాల‌నుంద‌ని ఖాన్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. అంటే షారూఖ్ తో లోకేష్ క‌న‌గ‌రాజ్ కి ఆఫ‌ర్ ఖాయ‌మైంద‌ని దీనిని బ‌ట్టి భావించాలి. మ‌రోవైపు త‌న కుమార్తె సుహానా ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న త‌దుపరి చిత్రంలో షారూఖ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సినిమా చేయాల‌నుంద‌ని కింగ్ ఖాన్ స్వ‌యంగా వ్యాఖ్యానించారు గ‌నుక ర‌జ‌నీ త‌ర్వాత అత‌డితో ప‌ని చేసేందుకు లోకేష్ క‌థ‌ను రాస్తాడేమో చూడాలి. మ‌రోవైపు షారూఖ్ కోసం జ‌వాన్ సీక్వెల్ స్టోరీని రెడీ చేసేందుకు అట్లీ స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్న‌ట్టు కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. కింగ్ ఖాన్ తో ద‌క్షిణాది ద‌ర్శ‌కులు అవ‌కాశాల్ని ఒడిసిప‌ట్టుకునేందుకు తెలివిగా వేగంగా ఆలోచించ‌డం గ‌మ‌నించ‌ద‌గిన‌ది.