Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్-క‌మ‌ల్ హాస‌న్ ప్రెండ్ షిప్ ఇలా ఉంటుంది!

ఆ స‌మ‌యంలోనూ క‌మ‌ల్ స్నేహానికి..పార్టీల‌కి సంబంధం లేద‌ని...రెండింటిని వేరుగానే చూడాల‌ని వ్యాఖ్యానించారు. అయితే ర‌జ‌నీకాంత్ పార్టీ పెట్ట‌లేద‌నుకోండి.

By:  Tupaki Desk   |   17 Sep 2023 8:42 AM GMT
ర‌జ‌నీకాంత్-క‌మ‌ల్ హాస‌న్ ప్రెండ్ షిప్ ఇలా ఉంటుంది!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్-విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ల స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా కాలంగా ఇద్ద‌రు మంచి స్నేహితులుగా కొన‌సాగుతున్నారు. ఇద్ద‌రు వేర్వేరు గా రాజ‌కీయ పార్టీలు పెట్టాల‌నుకున్న స‌మ‌యంలో కొన్ని ర‌కాల నెగిటివ్ క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. స్నేహితులైతే ఇద్ద‌రు ఒకే పార్టీ పెట్టొచ్చని...వేర్వేరు పార్టీల‌తో అభిమానుల్ని ఇబ్బంది పెట్ట‌డం దేనిక‌ని కొంత స్థ‌బ్ద‌త తెర‌పైకి వ‌చ్చింది.

ఆ స‌మ‌యంలోనూ క‌మ‌ల్ స్నేహానికి..పార్టీల‌కి సంబంధం లేద‌ని...రెండింటిని వేరుగానే చూడాల‌ని వ్యాఖ్యానించారు. అయితే ర‌జ‌నీకాంత్ పార్టీ పెట్ట‌లేద‌నుకోండి. అది వేరే సంగ‌తి. తాజాగా జ‌రిగిన 'సైమా' వేడుకల్లో 'విక్ర‌మ్' సినిమాకి గానూ క‌మ‌ల్ హాస‌న్ అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌మ‌ల్ ని వీరాభిమానిగా భావించి ఈ స‌క్సెస్ అందించారు. అయితే అదే లోకేష్ ఇప్పుడు ర‌జ‌నీకాంత్ తో నూ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ అభిమాని ర‌జ‌నీతో సినిమా చేయ‌డం ఏంట‌ని కొన్ని సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. వీటికి క‌మ‌మ‌ల్ సైమా వేదిక‌గా త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. 'వారిద్ద‌రు సినిమా చేయ‌డం ప‌ట్ల నేను ఎంతో గ‌ర్వప‌డుతున్నాను. దాదాపు 15 ఏళ్ల క్రితం 'క‌మ‌ల్ 50' అనే కార్య‌క్ర‌మంలో మా స్నేహ బంధం గురించి మాట్లాడాను. మా ఇద్ద‌రు లాంటి స్నేహితులు ఆనాటి త‌రంలో ఎవ‌రూ లేరు.

మా మ‌ధ్య కూడా మంచి పోటీ ఉండేది. అందువ‌ల్లే ఈ స్థాయికి చేరుకున్నాం' అని క‌మ‌ల్ తెలిపారు. అలాగే క‌మ‌ల్ హాస‌న్ గురించి కూడా ర‌జ‌నీ ఎంతో స్నేహంతో స్పందిస్తుంటారు. శంక‌ర్ 'రోబో' సినిమా ర‌జ‌నీతో చేస్తాను అనగానే నాతో కాదు ఇలాంటి సినిమాలు క‌మ‌ల్ తో చేయ్ అని స‌ల‌హా ఇచ్చారు. టెక్నిక‌ల్ వ‌ర్క్ ఉన్న సినిమాల‌కు కమ‌ల్ బాగా సూట‌వుతార‌ని సూచించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు అనుకోండి . అంత గొప్ప స్నేహం ర‌జ‌నీకాంత్-క‌మ‌ల్ హాస‌న్ మ‌ధ్య ఉంది.