Begin typing your search above and press return to search.

రజినీకాంత్.. ఆ సీక్వెల్ తొందరలోనే..

గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:43 AM GMT
రజినీకాంత్.. ఆ సీక్వెల్ తొందరలోనే..
X

గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ కూడా జైలర్ సినిమాతో రజినీకాంత్ పేరు మీదకి వచ్చేసింది. 600 కోట్లకి పైగా ఈ మూవీ వసూళ్లు సొంతం చేసుకొని రిక్కార్డ్ సృష్టించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా రోబో తర్వాత ఫ్యాన్స్ కోరుకునే సాలిడ్ సక్సెస్ దొరకలేదు.

జైలర్ సూపర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా డిస్టిబ్యూటర్ గా దిల్ రాజుకి ఈ మూవీ భారీ లాభాలు అందించింది. ఈ మూవీతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ గ్యాప్ తీసుకోకుండా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో దర్శకత్వంలో వెట్టయాన్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మాస్ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఈ ఏడాదిలోనే ఆ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత మరోసారి నెల్సన్ దిలీప్ జైలర్ సీక్వెల్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ 172వ మూవీగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. ఇప్పటికే స్టోరీ లాక్ అయిపోయినట్లు తెలుస్తోంది.

సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో అంతకుమించి సీక్వెల్ ఉండేలా నెల్సన్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారంట. ఇక రజినీకాంత్ కూడా ఓపిక ఉన్నంత వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ తో పాటు తెలుగు యాక్టర్ సునీల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సీక్వెల్ కూడా సునీల్ తప్ప మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలని కొనసాగించే అవకాశం ఉందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట.