Begin typing your search above and press return to search.

హిమాలయాలకు వెళ్లిన 'జైలర్‌'

సూపర్ స్టార్‌ రజినీకాంత్ ప్రశాంతత కోసం మరియు ఆరోగ్యం కోసం హిమాలయాలకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:32 AM GMT
హిమాలయాలకు వెళ్లిన జైలర్‌
X

సూపర్ స్టార్‌ రజినీకాంత్ ప్రశాంతత కోసం మరియు ఆరోగ్యం కోసం హిమాలయాలకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఆయన హిమాలయాలకు వెళ్లారు. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం సరిగా లేని కారణంగా గత కొన్నాళ్లుగా హిమాలయాలకు ఆయన వెళ్లడం లేదు. తాజాగా ఆయన ఆరోగ్యం బాగానే ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల హిమాలయాలకు వెళ్లారు.

నేడు రజినీకాంత్‌ నటించిన 'జైలర్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న మొన్నటి వరకు సినిమా ప్రమోషన్స్‌ తో బిజీగా ఉన్న రజినీకాంత్‌ నేడు విడుదల అవ్వడంతోనే హిమాలయాలకు వెళ్లి పోతున్నట్లుగా పేర్కొన్నారు. కనీసం రెండు నుంచి నాలుగు వారాల పాటు రజినీకాంత్ అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.

రజినీకాంత్ జైలర్‌ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించగా హీరోయిన్ గా తమన్నా నటించింది. తన గత చిత్రాలకు పూర్తి విభిన్నంగా ఈ సినిమాలో రజినీకాంత్ కనిపించబోతున్నాడు. ఆరు ఏడు సంవత్సరాల బాబుకు తాత పాత్రలో రజినీకాంత్‌ నటించడం విశేషం.

మొదటి సారి తాత పాత్రలో రజినీకాంత్‌ నటించిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. అంతే కాకుండా ప్రీ రిలీజ్ బజ్ కూడా బాగా పెరిగింది. కనుక తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. మరో వైపు లాల్‌ సలామ్‌ అనే సినిమాలో కూడా రజినీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు రజనీ కుమార్తె దర్శకత్వం వహిస్తున్నారు.