Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కు డాటర్స్ దెబ్బ!

పా రంజిత్ రజినీకాంత్ తో రెండు సినిమాలు చేశాడు. అయితే ఆ రెండు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పించలేకపోయాయి

By:  Tupaki Desk   |   11 Feb 2024 4:38 AM GMT
సూపర్ స్టార్ కు డాటర్స్ దెబ్బ!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ సౌత్ ఇండియాలోనే టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలంటే రజినీకాంత్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇండియన్ స్టార్ హీరోల జాబితాలో కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. అతనితో సినిమా చేయాలని చాలా మంది దర్శకుల కల. అయితే ఆయన ఇమేజ్ ని మ్యాచ్ చేస్తూ కథలు సిద్ధం చేసుకొని సినిమాలు చేసింది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు.

పా రంజిత్ రజినీకాంత్ తో రెండు సినిమాలు చేశాడు. అయితే ఆ రెండు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పించలేకపోయాయి. కమర్షియల్ హిట్స్ ఇచ్చే మురుగదాస్ కూడా రజిని ఇమేజ్ కి తగ్గ కథతో మూవీ చేయలేకపోయాడు. గత ఏడాది నెల్సన్ దిలీప్ చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. మూవీ కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ లో ఒకటిగా ఉంది.

ఇప్పటికి రజినీకాంత్ రోబో 2.ఓ మూవీనే కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా. దానిని ఎవరూ బీట్ చేయలేకపోయారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఇద్దరు కూతుళ్ళని సినిమాల పరంగా బాగా సపోర్ట్ చేశారు. సౌందర్య రజినీకాంత్ తో కొచ్చడియాన్ అనే మూవీ చేశారు. కంప్లీట్ గ్రాఫిక్స్ బేస్డ్ గా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఆమె తెరకెక్కించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

3 మూవీతో దర్శకురాలిగా మారిన పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తాజాగా తండ్రితో లాల్ సలామ్ అనే మూవీ చేసింది. నిజానికి ఈ మూవీ కథలో లీడ్ రోల్ రజినీకాంత్ కాదు. అయిన కూడా కూతురుకి సక్సెస్ ఇవ్వాలని కీలక పాత్రలో నటించాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రజినికాంత్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా ఈ మూవీకి ఫస్ట్ డేనే జీరో షేర్ వచ్చిందంటే ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రజినీకాంత్ కటౌట్ సినిమాకి ఆడియన్స్ ని రప్పిస్తుందని కనీసం ప్రమోషన్స్ కూడా చేయలేదు. లాల్ సలామ్ చిత్రాన్ని ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీగా చూడలేకపోయారు. అందుకే సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. రజినీకాంత్ కెరియర్ లోనే మొదటి రోజు ఘోరమైన కలెక్షన్స్ ని సాధించిన సినిమా ఇదే అనే మాట వినిపిస్తోంది.