Begin typing your search above and press return to search.

బ‌యోపిక్ లో మాజీ అల్లుడికి ఛాన్స్ సాధ్య‌మేనా?

కొన్ని క‌థ‌లు త‌ప్ప అన్ని ఇక్క‌డా స‌క్సెస్ కాలేదు. త‌లైవి(జ‌య‌ల‌లిత‌)..ఎన్టీఆర్ బ‌యోపిక్ సౌత్ లో పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు

By:  Tupaki Desk   |   2 May 2024 6:27 AM GMT
బ‌యోపిక్ లో మాజీ అల్లుడికి ఛాన్స్ సాధ్య‌మేనా?
X

సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి బ‌యోపిక్ లు తెర‌కెక్క‌డం రేర్. ఇంట్రెస్టింగ్ బ‌యోపిక్ లు ఎన్నో ఉన్నా? ఆ త‌ర‌హా ప్ర‌యోగాలు బాలీవుడ్ ద‌ర్శ‌కులుచేస్తారు త‌ప్ప సౌత్ మేక‌ర్స్ తొంద‌ర‌గా చేయ‌లేరు. అలాగ‌ని జీవిత క‌థ‌లు ఇక్క‌డ పూర్తిగా లేవ‌ని కాదు. జ‌య‌ల‌లిత‌...ఎన్టీఆర్..రాజశేఖరెడ్డి...ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ కొన్నితెర‌కెక్కాయి. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని... వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా మ‌రికొన్నిచిత్రాలు తెర‌కెక్కాయి. అయితే బాలీవుడ్ లో స‌క్సెస్ అయినంత‌గా ఇక్క‌డ స‌క్స‌స్ కాలేద‌న్న‌ది అంతే వాస్త‌వం.

కొన్ని క‌థ‌లు త‌ప్ప అన్ని ఇక్క‌డా స‌క్సెస్ కాలేదు. త‌లైవి(జ‌య‌ల‌లిత‌)..ఎన్టీఆర్ బ‌యోపిక్ సౌత్ లో పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్ కి కూడా రంగం సిద్ద‌మ‌వుతోన్న‌సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత సాజిద్ న‌డియావాలా ఆ ఛాన్స్ తీసుకుంటున్నారు. బ‌స్ కండెక్ట‌ర్ టూ సూప‌ర్ స్టార్ వ‌ర‌కూ ర‌జ‌నీ ఎదిగిన వైనాన్ని క‌ళ్ల‌కు క‌ట్ట‌బోతున్నారు. అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ర‌జ‌నీ పాత్ర బాధ్య‌త‌లు ఎవ‌రు తీసుకుంటున్నారు? వంటి విష‌యాలు గోప్యంగా ఉన్నాయి.

ఇంకా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌న‌ట రాలేదుగానీ...సాజిద్ ర‌జ‌నీతో సినిమా అనౌన్స్ చేయ‌డంతోనే ఈ విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. అయితే ర‌జనీ కాంత్ పాత్ర‌లో ధ‌నుష్ న‌టిస్తున్నాడ‌ని కూడా బ‌ల‌మైన ప్ర‌చారం సాగుతుంది. అన్నిర‌కాలు గా ఆ పాత్ర‌కు కేవ‌లం ధ‌నుష్ మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని కోలీవుడ్ మీడియాలోనూ వార్త‌లొస్తున్నాయి. కానీ ఆఛాన్స్ ధ‌నుష్‌కి ర‌జ‌నీ ఇస్తారా? లేదా? అన్న‌ది క్లారిటీ లేని అంశం.

ధ‌నుష్‌... ర‌జ‌నీకాంత్ మాజీ అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. ఐశ‌ర్య భ‌ర్త -ధనుష్ 20004 లో వివాహం చేసు కోవ‌డం..ఇటీవ‌ల విడిపోవ‌డం..ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉండ‌టం తెలిసిందే. ఈజంట విడిపోయే స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ స‌హా పెద్ద‌లంతా ఆ బంధాన్ని నిల‌బెట్టాల‌ని ఎంతోప్ర‌య‌త్నించారు. కానీ విడిపోయిన మ‌న‌సులు మళ్లీ క‌ల‌వ‌వు అని కోర్టులో విడాకుల పిటీష‌న్ ఇటీవ‌లే దాఖ‌లు చేసారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ర‌జ‌నీ బ‌యోపిక్ లో ధ‌నుష్ న‌టించ‌డం అన్న‌ది జ‌రుగుతుందా? ర‌జ‌నీ ఆ ఛాన్స్ మాజీకి ఇస్తారా? అన్న‌ది సందేహమ‌ని కోలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి.