హీరోలంతా జిమ్..యోగా చేసే హీరో ఎవరబ్బా?
ఈ రెండు పరిశ్రమలనే కాదు. కోలీవుడ్ , మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని పరిశ్రమల హీరోలు జిమ్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ హీరోలంతా యోగా చేసినట్లు ఎప్పుడూ కనిపించలేదు.
By: Tupaki Desk | 13 Jun 2025 11:00 PM ISTహీరోలంతా ఎక్కువగా జిమ్ మాత్రమే చేస్తారా? వాళ్లు ఫిట్ నెస్ సీక్రెట్ జిమ్ ఒక్కటేనా? అంటే సన్నివేశం అలాగా కనిపిస్తుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఏ హీరోని చూసినా జిమ్ లోనే కనిపిస్తారు. అవసరమైన డైట్ పాలో అవుతూ రెగ్యులర్ గా జిమ్ చేస్తుంటారు. ఇళ్లలోనే సొంత జిమ్ ల్లో రోజు రెండు ..మూడు గంటల సమయం కేటాయిస్తారు. ఉదయం జిమ్ చేసే హీరోలు కొంతమంది అయితే సాయంత్రం కసరత్తులు చేసేది మరికొంత మంది.
ఈ రెండు పరిశ్రమలనే కాదు. కోలీవుడ్ , మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని పరిశ్రమల హీరోలు జిమ్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ హీరోలంతా యోగా చేసినట్లు ఎప్పుడూ కనిపించలేదు. అప్పుడ ప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం యోగాసనాల్లో కూర్చున్న భంగిమ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అలాగే హిమాలయాలకు వెళ్లినప్పుడు కనిపిస్తుంటారు.
యోగా కంటే జిమ్ తో వచ్చే లాభాలే హీరోలకు అన్ని రకాలుగా కలిసొస్తాయన్నది కొందరు హీరోల మాట. ఫిట్ నెస్ తో పాటు బాడీ షేప్ కూడా తయారవుతుంది. అదే యోగాలో ఆరోగ్యం తప్ప బాడీ షేప్ అన్నది బిల్డ్ కాదని అందుకే చాలా మంది హీరోలు జిమ్ నే ఎంచుకుంటారంటున్నారు. ఇందులకు హీరోయిన్లు కూడా మినిహాయింపు కాదు. చాలా మంది హీరోయిన్లు జిమ్ లోనే వర్కౌట్ లు చేస్తుంటారు.
అయితే జిమ్ తో పాటు అదనంగా యోగాసనాలు కూడా వేస్తుంటారు. యోగాసనాలు వేయడంలో బాలీవుడ్ భామలు స్పెషలిస్ట్ లు. మలైకా అరోరా, కరీనా కపూర్ లాంటి వారు యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుం టారు. చాలా పరిమితంగా జిమ్ కు వెళ్తుంటామని గతంలో చెప్పిన సందర్భాలున్నాయి.
