విదేశీయులే నయం.. మన యూత్‌కి రజనీ క్లాస్
విదేశీయులు శాంతి, ఆనందాన్ని కనుగొనే ప్రదేశం ఇదేనని ధ్యానం, యోగా, సహజ జీవనాన్ని అభ్యసిస్తామని వారు నాతో అన్నారు.
By: Tupaki Desk | 1 May 2025 9:47 PM ISTపాశ్చాత్యులు ఆనందం, శాంతిని కనుగొనేందుకు భారతీయ సంస్కృతిని అనుసరిస్తుంటే, భారతదేశ యువత సొంత సంస్కృతికి దూరమై పాశ్చాత్య ప్రభావానికి లోనవుతున్నారని అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. పశ్చిమ దేశాల ప్రజలు శాంతి, ప్రేరణ కోసం భారతీయ సంస్కృతి వైపు ఎలా ఆకర్షితులవుతున్నారో కూడా ఆయన గమనించినట్టు తెలిపారు.
చెన్నైలో తన భార్య లతా రజనీకాంత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీడియో కాల్ లో రజనీకాంత్ మాట్లాడారు. నేటి మొబైల్ ఫోన్ల యుగంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మన పిల్లలు, కొందరు పెద్దలకు కూడా పెద్దగా తెలియడం లేదు. మన దేశ గొప్పతనం వైభవం గురించి తెలియకుండానే పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తారని రజనీ ఆవేదన వ్యక్తం చేసారు. పాశ్చాత్యులు తమ సొంత సంస్కృతిలో శాంతిని కనుగొనలేకపోవడంతో భారతదేశానికి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
విదేశీయులు శాంతి, ఆనందాన్ని కనుగొనే ప్రదేశం ఇదేనని ధ్యానం, యోగా, సహజ జీవనాన్ని అభ్యసిస్తామని వారు నాతో అన్నారు. లత ఇప్పుడు దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తోంది. దేవుని దయతో ఆమె ప్రయత్నాలు విజయవంతమవుతాయని నేను ప్రార్థిస్తున్నాను.. అని రజనీ అన్నారు.
వేట్టయ్యాన్ తర్వాత రజనీ తన తదుపరి చిత్రం కూలీలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2025 ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర తదితరులు నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 షూటింగ్ లోను రజనీ పాల్గొంటున్నారు.
