ఆయనతో పాటూ పాజిటివ్ ఎనర్జీ కూడా సెట్స్ లోకి వచ్చేస్తుంది
ఇదిలా ఉంటే రీసెంట్ గా శృతి ఓ పాడ్‌కాస్ట్ లో పాల్గొని రజినీకాంత్ తో కలిసి వర్క్ చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి మాట్లాడారు.
By: Tupaki Desk | 12 July 2025 12:00 AM ISTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, లియో సినిమాల తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటూ రజినీకాంత్- లోకేష్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో అందరికీ కూలీపై మంచి అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా లోకేష్ కూలీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న కూలీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. వీరితో పాటూ ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే రీసెంట్ గా శృతి ఓ పాడ్‌కాస్ట్ లో పాల్గొని రజినీకాంత్ తో కలిసి వర్క్ చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి మాట్లాడారు. తమిళ సినిమాకు తన తండ్రి కమల్ హాసన్, రజినీకాంత్ రెండు మూల స్తంభాలని, అందరి లానే తనకు కూడా ఆయన సూపర్ స్టార్ రజినీ సర్ లానే తెలుసని, కానీ కూలీ షూటింగ్ టైమ్ లో ఆయన గురించి మరింత తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని శృతి హాసన్ తెలిపారు.
రజినీకాంత్ అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అని, కత్తిలా పదునైనవాడని, చాలా కూల్ అని చెప్పారు. ఆయన చాలా కూల్ గా ఉంటారని, ఆయనతో మాట్లాడటం కూడా చాలా ఈజీ అని తాను రజినీతో చెప్పినట్టు శృతి వెల్లడించారు. ఆయన సెట్స్ లో అడుగు పెడితే ఆయనతో పాటూ పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చేస్తుందని, ఆయన ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా ఉంటారని, అతనితో కలిసి వర్క్ చేయడానికి అందరూ సంతోషంగా ఉంటారని ఆమె తెలిపారు. శృతి హాసన్ రజనీ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
