ఎయిర్ పోర్టులో సీరియస్ అయిన స్టార్ హీరో!
తమ్ముడు పవన్ కళ్యాన్ మాత్రం జనసే పార్టీ స్థాపించి పోరాటం చేసి ఎలాగూ డిప్యూటీ సీఎం వరకూ వెళ్లగలిగారు.
By: Tupaki Desk | 20 Sept 2024 2:47 PM ISTతమిళనాడు లో విశ్వనటుడు కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ పెట్టి ఫెయిలయ్యారు. కమల్ కంటే ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయ పార్టీ స్థాపించి ఫెయిలయ్యారు. పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కున్నారు. తమ్ముడు పవన్ కళ్యాన్ మాత్రం జనసే పార్టీ స్థాపించి పోరాటం చేసి ఎలాగూ డిప్యూటీ సీఎం వరకూ వెళ్లగలిగారు.
ఇదెంతో సుదీర్ఘమైన పోరాటంతోనే సాధ్యమైంది. అటు తమిళనాడులో దళపతి విజయ్ కూడా పార్టీ స్థాపించారు. 2026 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు. ఇలా స్టార్ల మధ్య రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కొన్ని నెలలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ పై రాజకీయ అంశాలు తిరుగుతున్నాయి. వాస్తవానికి రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలనుకుని విరమించుకున్నారు.
వయసు సహకరించని కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో మళ్లీ ఆయన తమిళ నాడు లో ఓ పార్టీకి మద్దతిచ్చినట్లు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయాలపై ఆయన మనసు మళ్లీ మళ్లుతుందా? అన్న చర్చ సాగుతుంది. దళపతి విజయ్ పార్టీకి వ్యతిరేకంగా రజనీ పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో రాజకీయ అంశాల్ని పలువురు జర్నలిస్ట్ లు ఆయన వద్ద ప్రస్తావించడంతో రజనీకాంత్ సీరియస్ అయ్యారు. ఓకింత రజనీ తీవ్ర అసహనాన్నే వ్యక్తి చేసినట్లు కనిపిస్తుంది. ప్లైట్ దిగిన అనంతరం అరైవల్ పాయింట్ నుంచి కారు వద్దకు నడుచుకుంటూ వస్తోన్న సమయంలో ఆయన్ని వెంట పడి మరీ రాజకీయ ప్రశ్నలు అడిగారు. ఉదయనిధి స్టాలిన్ కి మద్దతి స్తున్నారా? అని అడగగా.... రజనీ మాట్లాడటానికి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు.
