రజనీకాంత్ వాళ్లకు బిజినెస్ పార్టనర్!
తాజాగా స్టాలిన్ కి చెందిన రెడ్ జెయిట్ ఫిల్మ్స్ భాగస్వామ్యంలోనే రజనీకాంత్ కూడా నిర్మాతగా పెట్టు బడులు పెట్టడం విశేషం.
By: Tupaki Desk | 16 July 2025 1:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య వివాదాలు తలెత్తితే అది శాశ్వతం. దాదాపు చాలా కాలం పాటు ఆ వైరం కొనసాగుతుంటుంది. ఆ వైరం అంత సులభంగా ఇద్దరి మనసుల్లో నుంచి తొలగిపోదు. కానీ పైకి మాత్రం సినిమా వాళ్లమంతా కలిసే ఉంటాం అంటారు. ఈ మాట కూడా అక్షర సత్యమే. లోలోపల మనసులో ఎన్ని ఎన్నా? కొన్ని సందర్భాల్లో మాత్రం కలిసి పనిచేస్తుంటారు. కలిసి వేదికను పంచుకుంటుంటారు. అలా సినిమా వాళ్ల మధ్య ఓరకమైన ఐఖ్యత కనిపిస్తుంటుంది.
కానీ రాజకీయాల్లో మాత్రం వివాదం...శత్రుత్వం మాత్రం కొంత మంది మధ్య తప్ప చాలా మంది లో అశాశ్వతంగానే కనిపిస్తుంది. పార్టీలు మారిన ప్పుడు ..ఓటమి పాలైనప్పుడు..అసంతృప్తి సెగలు లేచిన ప్పుడు భాయ్ భాయ్ అంటూ కలిసిపోతుంటారు. అప్పటి వరకూ కనిపించని అనుబంధం కనిపిస్తుం టుంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ - తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ మధ్య అలాంటి అను బంధమే హైలైట్ అవుతుంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు? అన్న తరుణంలో స్టాలిన్ పార్టీపై రజనీ కాంత్ అభిమానులు గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసారు.
అప్పటికే మరోవైపు విశ్వనటుడు కమల్ హాసన్ కూడా పార్టీ స్థాపించి రెడీగా ఉన్న సమయం అది. ఇదం తా కొన్నేళ్ల క్రితం నాటి మాట. ప్రస్తుతం రజనీకాంత్ స్టాలిన్ మద్దతుదారుడిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య దళపతి విజయ్ పై నేరుగానే రజనీ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. విజయ్ స్టాలిన్ ప్రభు త్వాన్ని విమర్శించిన తరుణంలో రజనీ బాహాటంగానే విజయ్ తో బాహాబాభహాకి దిగారు. విజయ్ ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
తాజాగా స్టాలిన్ కి చెందిన రెడ్ జెయిట్ ఫిల్మ్స్ భాగస్వామ్యంలోనే రజనీకాంత్ కూడా నిర్మాతగా పెట్టు బడులు పెట్టడం విశేషం. `మహారాజా` దర్శకుడి నితిలన్ స్వామినాధన్ తో ఓ సినిమా చేస్తున్నారు రజనీ. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ భాగస్వామిగా మారారు. దీంతో రజనీకాంత్ ఆ సంస్థతో బిజినెస్ పార్టనర్ గా మారినట్లు అయింది. దాదాపు రెండు దశాబ్ధాలత తర్వాత రజనీ నిర్మా ణంలోకి దిగడం విశేషం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
