Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత నిర్మాత‌గా సూప‌ర్ స్టార్!

ఈ రెండు సినిమాలపై భారీ అంచ‌నాలున్నాయి. అలాగే ఈ రెండు సినిమాల‌కు క‌లిపి ర‌జనీ వంద‌ల కోట్ల రూపా యాలు పారితోషికం తీసుకున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   14 July 2025 5:00 PM IST
రెండు ద‌శాబ్దాల త‌ర్వాత నిర్మాత‌గా సూప‌ర్ స్టార్!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 'జైల‌ర్' స‌క్సస్ తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన 'లాల్ స‌లామ్', 'వెట్టేయాన్' లాంటి సినిమాలు వైఫ‌ల్యం చెందినా ఆ ప్ర‌భావం ర‌జ‌నీపై పెద్ద‌గా ప‌డ‌లేదు. 'జైల‌ర్' 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో ప్లాప్ లేవీ క‌నిపించ‌లేదు. ఆ వెంట‌నే ర‌జ‌నీ లైన‌ప్ లో కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండ‌టంతో ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం 'కూలీ' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అలాగే 'జైల‌ర్ 2' తోనే వ‌చ్చే ఏడాది అల‌రించ‌నున్నారు.

ఈ రెండు సినిమాలపై భారీ అంచ‌నాలున్నాయి. అలాగే ఈ రెండు సినిమాల‌కు క‌లిపి ర‌జనీ వంద‌ల కోట్ల రూపా యాలు పారితోషికం తీసుకున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఈ రెండు సినిమాల‌కు క‌లిపి 400 కోట్లకు పైగానే అందుకున్న‌ట్లు వినిపిస్తుంది. అంత‌కుముందు జైల‌ర్ హిట్ అయిన సంద‌ర్భంగా స‌న్ పిక్చ‌ర్స్ అదనంగా మ‌రో 100 కోట్లు పారితోషికం రిలీజ్ అనంత‌రం చెల్లించారు. మ‌రి ఇప్పుడీ డ‌బ్బు అంతా ర‌జనీ కాంత్ ఏం చేస్తున్న‌ట్లు? అంటే ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌స్తోంది.

మ‌ళ్లీ ర‌జ‌నీకంత్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది 'మహారాజా' దర్శ‌కుడు నితిలాన్ సామినాథన్ తో ఓ సినిమా నిర్మించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారుట‌. ఇప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్స్ కూడా పూర్త‌యిన‌ట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ రెడ్ జెయింట్ ఫిల్మ్స్ భాగ‌స్వామ్యంతో నిర్మిస్తున్నారుట‌. అయితే ఇందులో హీరోగా ర‌జ‌నీకాంత్ న‌టిస్తారా? మ‌రో హీరోతో ర‌జనీ నిర్మించే సినిమా అవుతుందా? అన్న‌ది తేలాలి.

ర‌జ‌నీ కాంత్ నిర్మాత‌గా అంత యాక్టివ్ గా సినిమాలు నిర్మించింది లేదు. రెండు ద‌శాబ్దాల క్రితం 'బాబా' చిత్రాన్ని లోట‌స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌లో నిర్మించారు. ఇది ర‌జ‌నీ సొంత బ్యాన‌ర్ గా వెలుగులోకి వ‌చ్చిం ది. ఆ త‌ర్వాత ఇదే సంస్థ‌లో ర‌జ‌నీ మ‌రో సినిమా నిర్మించ‌లేదు. ఆ సంస్థ‌లోనే కాదు మ‌ళ్లీ ఆయ‌న నిర్మా ణం వైపే చూడ‌లేదు. ఈ సినిమా కంటే ముందు ర‌జ‌నీకాంత్ భార్య లతా రజనీకాంత్ 'శ్రీ రాఘవేంద్రర్' అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది 1985లో విడుదలైన ర‌జ‌నీ 100వ చిత్రం.