సౌత్ లో మరో రాజమౌళి ఆయనే!
దేశం గర్వించ దగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయన విజయాలే అంతటి గొప్ప స్థానాన్ని కట్టబెట్టాయి.
By: Tupaki Desk | 5 Aug 2025 1:00 PM ISTదేశం గర్వించ దగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయన విజయాలే అంతటి గొప్ప స్థానాన్ని కట్టబెట్టాయి. పాన్ ఇండియా చిత్రానికి కొత్త మీనింగ్ పరిచయం చేసిన ఘనుడు జక్కన్న. కెరీర్ లో ఇంత వరకూ వైఫ ల్యమే ఎరుగని డైరెక్టర్. `స్టూడెంట్ నెంబర్` నుంచి మొన్నటి 'ఆర్ ఆర్ ఆర్' వరకూ ప్రతీది ఓ గొప్ప కళా ఖండమే. చిత్ర పరిశ్రమకు ఎన్నో విజయాలు అందించారు. తన విజయాలతో టాలీవుడ్ గమనాన్ని విశ్వవ్యాప్తం చేసారు. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి విజయాలతో అంతర్జాతీయ స్థాయికి చేరారు. అందుకే ప్రఖ్యాత నటులంతా రాజమౌళితో కలిసి పని చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
వైఫల్యమే ఎరుగని సంచలనం
ఆ రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ రాజమౌళికి ఎంతో రుణపడి ఉంది. అంతటి లెజెండరీ డైరెక్టర్ తోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీవుడ్ యువ సంచలనం లోకేష్ కనగరాజ్ ను పోలిక చేయడం విశేషం. టాలీవుడ్ కి రాజమౌళి ఎలాగో? మా కోలీవుడ్ కి లోకేష్ అంటూ స్వయానా ఆయన నోట జాలువారిన వాఖ్య మిది. కోలీవుడ్ లో ఇంత వరకూ వైఫల్యం ఎరుగని దర్శకుడిగా లోకేష్ ని కీర్తించారు. ఇంతింతై వటుడిం తైన చందంగా తమిళ పరిశ్రమలో లోకేష్ ఎదుగుదలను సూపర్ స్టార్ గుర్తు చేసుకున్నారు. తొలి సినిమా నుంచి 'లియో' వరకూ లోకేష్ విజయాలను కొనియాడారు.
తొలి సినిమాతోనే ప్రశంస
ఇంత వరకూ సూపర్ స్టార్ నోట ఏ డైరెక్టర్ గురించి ఇలాంటి ప్రశంస రాలేదు. ఇప్పటి వరకూ రజనీకాంత్ చాలా మంది డైరెక్టర్లతో పని చేసారు. ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఆయన సినిమాలు చేసారు. ఒక్కో డైరెక్టర్ లో ఒక్కో ప్రత్యేకతను పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. కానీ లోకేష్ మాత్రం అతడి కెరీర్ లో ఓస్పెషల్ డైరెక్టర్ గా ఫోకస్ చేసే ప్రయత్నం అన్నది లోకేష్ ఘన కీర్తిని చాటి చెప్పేదే. డైరెక్టర్ గా లోకేష్ ప్రస్థానం తొమ్మిదేళ క్రితం `మానగరం`తో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన చిత్రం 15 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగులో విమర్శకుల ప్రశంలందుకున్న చిత్రంగా నిలిచింది.
మరో బ్లాక్ బస్టర్ ఖాయం
అటుపై లోకేష్ 'ఖైదీ'తో సౌత్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆ విజయం అనంతరం ఎల్ సీయూని క్రియేట్ చేసి అందులోనే సినిమాలు చేయడం చేయడం విధితమే. `విక్రమ్`, `లియో` లాంటి చిత్రాలు ఎల్ సీయూ నుంచి రిలీజ్ అయినవే. ఈ రెండింటి మధ్యలో యూనివర్శ్ తో సంబంధం లేకుండా `మాస్టర్` చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇదే పేట్రన్ లో రజనీకాంత్ తో `కూలీ` చేసారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా విషయంలో రజనీకాంత్ ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. `జైలర్` విజయం తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే అంచనాలతో ఉన్నారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
