Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రేంజ్ ఎంతో తెలుసా?

ఇక ఈ సినిమా కోసం ర‌జ‌నీ- లోకేష్ పారితోషికాలు క‌లుపుకుంటే 200 కోట్లు కాగా, మ‌రో 150 కోట్లు సినిమా మేకింగ్ కోసం కేటాయించిన బ‌డ్జెట్.

By:  Tupaki Desk   |   29 May 2025 8:15 AM IST
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రేంజ్ ఎంతో తెలుసా?
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పారితోషికం రేంజ్ గురించి అభిమానుల్లో చాలా చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న ఒక్కో చిత్రానికి 300 కోట్ల పారితోషికం అందుకుంటున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే అత‌డు 'కూలీ' చిత్రానికి ఎంత మొత్తం అందుకుంటున్నారు? అంటే.. దీనికి జ‌వాబు దొరికింది. ర‌జ‌నీ ముంద‌స్తుగా అందుకుంటున్న‌ పారితోషికం రేంజ్ 150 కోట్లు. ఆపై సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లై, బాగా ఆడితే లాభాల నుంచి వాటా అందుతుంది. జైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది గ‌నుక లాభాల నుంచి వాటా అందుకున్నారు. ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన కూలీకి ఇండ‌స్ట్రీలో బ‌జ్ ఒక రేంజులో ఉంది. ఈ చిత్రంలో ర‌జ‌నీతో పాటు నాగార్జున‌, అమీర్ ఖాన్, ఉపేంద్ర‌, శ్రుతిహాస‌న్ లాంటి క్రేజీ స్టార్లు న‌టించ‌డం కూడా బిజినెస్ రేంజ్ పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది.

ఇప్ప‌టికే ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ రూపంలో ఈ సినిమా నిర్మాత‌లు భారీగా ఆర్జించారు. ఆగ‌స్టులో రిలీజ్ కి రానున్న కూలీ కోసం లోకేష్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే కనగరాజ్ 'కూలీ' కోసం రూ. 50 కోట్ల పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ర‌జ‌నీ, లోకేష్ ఇద్ద‌రికీ ఆల్ టైమ్ బెస్ట్ పారితోషిక‌లు అందాయి.

ఇక ఈ సినిమా కోసం ర‌జ‌నీ- లోకేష్ పారితోషికాలు క‌లుపుకుంటే 200 కోట్లు కాగా, మ‌రో 150 కోట్లు సినిమా మేకింగ్ కోసం కేటాయించిన బ‌డ్జెట్. మ‌రో 25 కోట్లు ప్ర‌చారం కోసం ఖ‌ర్చు చేస్తారు. ఓవ‌రాల్ గా కూలీ సినిమా కోసం స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ దాదాపు 375 కోట్ల బ‌డ్జెట్ ని పెడుతోంది. 'కూలీ' డిజిట‌ల్ రైట్స్ -130 కోట్లు, శాటిలైట్-90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ -20 కోట్లు ప‌లికాయి. 240 కోట్లు నాన్ థియేట్రిక‌ల్ రూపంలో ద‌క్కింది. అయితే థియేట్రిక‌ల్ గా 150 కోట్లు వ‌సూలు చేస్తే ఈ సినిమా సుర‌క్షిత స్థానానికి చేరుకున్న‌ట్టు. 'కూలీ' ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో విడుదలవుతోంది.