నేటి యువతపై రజనీ క్రేజీ కామెంట్స్
ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్నది నానుడి దాన్ని అక్షరాలా పాటిస్తుంటారు సూపర్ స్టార్ రజనీకాంత్.
By: Tupaki Desk | 1 May 2025 3:00 PM ISTఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్నది నానుడి దాన్ని అక్షరాలా పాటిస్తుంటారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఎంత స్టార్ హోదాని దక్కించుకున్నా రియాలిటీకి దగ్గరగానే ఉండాలని, ఊహల్లో కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండాలని కోరుకోవడమే కాకుండా అదే పంథాని స్వయంగా పాఠిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారాయన. స్క్రీన్‌పై మెరుపులు మెరిపించే రజనీ రియల్ లైఫ్‌లో సాధారణ వ్యక్తిలా ఎలాంటి మేకప్, విగ్గు లేకుండా కనిపిస్తారన్నది అందిరికి తెలిసిందే. భారతీయ విలువలకు, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుంటారు.
ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న రజనీకాంత్ తాజాగా నేటి యువతిపై చేసిన క్రేజీ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా తన భార్య లత నిర్వహించిన ఓ సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న రజనీ నేటి యువతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తోందన్నారు. `ఈ మొబైల్ యుగంలో యువతకు, కొంతమంది పెద్దలకు మన దేశ సంప్రదాయాల గురించి తెలియడం లేదు. వారంతా భారతదేశ గొప్పదనం, వైభవం గురించి తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు.
విదేశీయులు వారి సంప్రదాయాల్లో ఆనందం, శాంతిని కనుగొనలేకపోవడం వల్లే మనదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ధ్యానం, యోగా ద్వారా ఆనందాన్ని కనుగొన్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకు లత ఒక గొప్ప ప్రయత్నం మొదలు పెట్టింది. దేవుడి దయతో ఆ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా` అన్నారు. రజనీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలపైనే మాట్లాడే రజనీ తొలిసారి దేశ యువత పాశ్చాత్య పోకడలపై క్రేజీ కామెంట్స్ చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉంటే రజనీ ప్రస్తుతం రెండు భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లోరజనీ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ `కూలీ`. బంగారం స్ల్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలోని కీలక పాత్రల్లో నాగార్జున, ఉపేంద్రతో పాటు శృతిహాసన్, సత్యరాజ్, రెబామోనికా జాన్ నటిస్తున్నారు. ఇక కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కనిపించబోతున్నాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ క్రేజీ ఐటమ్ నంబర్‌లో మెరవబోతోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక `జైలర్`తో రికార్డులు బద్ందలు కొట్టిన రజనీ ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా `జైలర్ 2` చేస్తున్నారు. ఇందులో మెయిన్ విలన్‌గా ఎస్.జె. సూర్య నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
