ఆ ఇద్దరు ఫ్లాపు డైరెక్టర్లతో రజినీ సినిమా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2025 11:00 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
అయితే రజినీకాంత్ ఓ వైపు కూలీ సినిమా చేస్తూనే మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్2 కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే జైలర్2 తర్వాత రజినీకాంత్ ఓ ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి డిస్కషన్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ డైరెక్టర్లు మరెవరో కాదు హెచ్. వినోద్ మరియు ఎస్. యు అరుణ్ కుమార్.
ఈ సినిమాలను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఈ వార్తలొచ్చినప్పటి నుంచి రజినీ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. అరుణ్ కుమార్ చీతా, వీర ధీర శూరన్ లాంటి మంచి సినిమాలను అందించినప్పటికీ, ఆయన సినిమాలేవీ కమర్షియల్ గా సక్సెస్ అవలేదని అంటున్నారు. మరోవైపు హెచ్. వినోద్ కూడా ఫామ్ లో లేడు. ఆయన రీసెంట్ సినిమాలు తునివు, వలిమై బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి.
ఎంతో స్ట్రాంగ్ బజ్ తో రానున్న జైలర్2 కు మిక్డ్స్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం ఖాయం. అంతటి భారీ సినిమా తర్వాత రజినీ తన తర్వాతి ప్రాజెక్టును ఫామ్ లో ఉన్న మంచి డైరెక్టర్ తో చేయాలి తప్పించి ఇలాంటి ఫ్లాపు డైరెక్టర్లతో కాదని, వారితో సినిమాలు చేయొద్దని ఫ్యాన్స్ రజినీకి సూచిస్తున్నారు.
అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదు కదా అని రజినీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జైలర్2 తర్వాత సూపర్ స్టార్ ఎవరితో సినిమాను చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
