కూలీ ఇంకా ఏదో కావాలి..?
సూపర్ స్టార్ రజినికాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు లోకేష్.
By: Tupaki Desk | 28 July 2025 2:00 AM ISTసూపర్ స్టార్ రజినికాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు లోకేష్. అంతేకాదు అతను కొత్తగా సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక కొత్త సంచలనానికి రెడీ అయ్యాడు. ఐతే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ స్టార్ రజినీతో చేసిన సినిమా కూలీ. ఈ సినిమాపై ఫ్యాన్స్ అయితే తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు.
కింగ్ నాగార్జున ఢీ..
సినిమాలో రజినీని మన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఢీ కొడుతున్నాడు. సినిమాలో విలన్ గా నాగార్జున ఎందుకు ఎలా చేశారన్నది తెర మీద చూస్తేనే తెలుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు కన్నడ స్టార్ ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఐతే కూలీ సినిమాలో ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నా కూడా సినిమాపై ఆశించిన రేంజ్ బజ్ లేదు.
లోకేష్ సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా అంటే దానికి ఒక లెక్క ఉండాలి. ఐతే ఎందుకో కూలీ సినిమాపై అంత బజ్ లేదు. స్టార్స్ చాలామంది ఉన్నా కూడా సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు. అదీగాక ఆగష్టు 14న ఈ సినిమాకు పోటీగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేసిన వార్ 2 కూడా వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య ఒక క్రేజీ ఫైట్ జరగనుంది.
పూజా హెగ్దే మోనిక సాంగ్..
కూలీ సినిమాను కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కూలీ సినిమాలో పూజా హెగ్దే మోనిక సాంగ్ చేసింది. అమ్మడి థై షోతో సాంగ్ కే సూపర్ క్రేజ్ తెచ్చింది. ఐతే సాంగ్స్, అప్డేట్స్ ఎన్ని వస్తున్నా కూలీ ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. మరి అది ట్రైలర్ తో ఆ దాహం తీరుతుందా అన్నది చూడాలి.
కూలీ సినిమాలో స్టార్ క్యామియోస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇస్తాయని తెలుస్తుంది. ఐతే నాగార్జున మాత్రం ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సర్ ప్రైజ్ చేస్తాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ భారీ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.