Begin typing your search above and press return to search.

రజినీ హీరో- నాగ్ విలన్! నిజమేనా?

నాగ్ రోల్ కు సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత ఉందో చెప్పేశారు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే కూలీ మూవీ షూటింగ్ పూర్తి కాగా, ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   28 May 2025 5:50 PM
రజినీ హీరో- నాగ్ విలన్! నిజమేనా?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి ఇప్పుడు కూలీ మూవీకి గాను వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని ఇప్పటికే టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

నాగ్ రోల్ కు సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత ఉందో చెప్పేశారు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే కూలీ మూవీ షూటింగ్ పూర్తి కాగా, ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది. అదే సమయంలో రజినీ కాంత్.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ.. జైలర్ సీక్వెల్ తో బిజీ అయిపోయారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారని సమాచారం.

అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే సెకెండ్ పార్ట్ పై కూడా అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు జైలర్ సీక్వెల్ కు సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ నటసింహం బాలయ్య కీలక పాత్రలో నటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని టాక్ వినిపించింది. ఇప్పుడు సినిమాలో విలన్ రోల్ కోసం అక్కినేని నాగార్జునను అనుకుంటున్నారట మేకర్స్. రీసెంట్ గా ఆయనను సంప్రదించారని కూడా తెలుస్తోంది.

కానీ నాగ్.. ఇంకా తన డెసిషన్ ను చెప్పలేదని సమాచారం. కొద్ది రోజుల్లో చెబుతా అన్నారట. అలా ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోసారి నాగ్, రజినీ కాంబో రిపీట్ అవుతుందని, వెయిటింగ్ ఫర్ అప్డేట్ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొందరు మాత్రం.. వేరేలా స్పందిస్తున్నారు. ఎందుకంటే నాగార్జునకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో అనేక సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకున్నారు. భారీ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మరో స్టార్ హీరోకు విలన్ గా అంటే ఒక్కసారి ఆలోచించాలని చెబుతున్నారు. మరేం జరుగుతుందో.. నాగ్ ఏం చేస్తారో.. అసలు నిజమో కాదో వేచి చూడాలి.