Begin typing your search above and press return to search.

క‌న్న‌ప్ప‌.. రజినీ రివ్యూ వ‌చ్చేసింది

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో రీసెంట్ గానే కొచ్చిలో ట్రైల‌ర్ లాంచ్ చేసి ఆ ఈవెంట్ కు మోహ‌న్ లాల్ ను తీసుకొచ్చి కొంత అటెన్షన్ ను సంపాదించుకున్నారు

By:  Tupaki Desk   |   16 Jun 2025 6:02 PM IST
క‌న్న‌ప్ప‌.. రజినీ రివ్యూ వ‌చ్చేసింది
X

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన క‌న్న‌ప్ప సినిమా రిలీజ్ కు రెడీ అయింది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో రీసెంట్ గానే కొచ్చిలో ట్రైల‌ర్ లాంచ్ చేసి ఆ ఈవెంట్ కు మోహ‌న్ లాల్ ను తీసుకొచ్చి కొంత అటెన్షన్ ను సంపాదించుకున్నారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అన్ని భాష‌ల ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుని క‌న్న‌ప్ప‌కు మంచి ఓపెనింగ్స్ ను అందుకోవాల‌ని విష్ణు ప్ర‌య‌త్నిస్తున్నాడు.

అందులో భాగంగా త‌మిళ ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ర‌జినీకాంత్ ను సెలెక్ట్ చేసుకున్నాడు మంచు విష్ణు. మోహ‌న్ బాబు- ర‌జినీకాంత్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విష‌యం అంద‌రికీ తెలుసు. వారిద్ద‌రూ త‌ర‌చూ క‌లుస్తూ ఉంటారు. ర‌జినీ హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌తీసారి మోహ‌న్ బాబు ఇంటికి వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు క‌న్న‌ప్ప కోసం విష్ణు, మోహ‌న్ బాబు క‌లిసి ర‌జినీ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు.

గ‌తంలో మోహ‌న్ బాబు- ర‌జినీకాంత్ క‌లిసి చేసిన పెద‌రాయుడు సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆ సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా అక్క‌డ‌కు వెళ్లిన మోహ‌న్ బాబు, తాను నిర్మించిన క‌న్న‌ప్ప సినిమాను ర‌జినీకాంత్ కు చూపించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మంచు విష్ణు ఓ పోస్ట్ రూపంలో త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఆ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది.

"గ‌త రాత్రి ర‌జినీకాంత్ అంకుల్ క‌న్న‌ప్ప మూవీ చూశారు. సినిమా పూర్త‌య్యాక ఆయ‌న న‌న్ను గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని సినిమా త‌న‌కెంతో న‌చ్చింద‌ని చెప్పారు. ఓ యాక్ట‌ర్ గా ఈ హ‌గ్ కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేశాను. ఇవాళ నేనెంతో హ్యాపీగా ఫీల‌వుతున్నా. ర‌జినీ అంకుల్ న‌న్ను ఎంక‌రేజ్ చేసిన‌ట్టు అనిపిస్తుంది. క‌న్న‌ప్ప జూన్ 27న రిలీజ్ అవుతుంది. ప్ర‌పంచం మొత్తం శివుని మాయాజాలాన్ని అనుభూతి చెందేలా చేయ‌డానికి నేనెంతో వెయిట్ చేస్తున్నా" అని విష్ణు ఎమోష‌న‌ల్ గా ట్వీట్ చేశాడు.

ముకేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌న్న‌ప్ప సినిమాలో ప్ర‌భాస్ తో పాటూ మోహ‌న్ లాల్, మోహ‌న్ బాబు, అక్ష‌య్ కుమార్, కాజ‌ల్, బ్ర‌హ్మానందం లాంటి భారీ క్యాస్టింగ్ ఉంది. చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్న త‌న‌కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ ను ఇస్తుంద‌ని విష్ణు క‌న్న‌ప్ప పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. రీసెంట్ గా రిలీజైన క‌న్న‌ప్ప ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.