Begin typing your search above and press return to search.

కూలీకి మ‌రో స్పెషల్ ఎట్రాక్ష‌న్?

ఈ సినిమాపై రోజురోజుకీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రిలీజైన పోస్టర్లు, టీజ‌ర్, పాట‌లకు ఆడియ‌న్స్ నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వస్తోంది.

By:  Tupaki Desk   |   23 July 2025 1:12 PM IST
కూలీకి మ‌రో స్పెషల్ ఎట్రాక్ష‌న్?
X

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కొన్ని కాంబినేష‌న్ల‌కు స్పెష‌ల్ క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేష‌న్ లో మ‌ళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ఓ కాంబినేష‌న్ ఇప్పుడు చాలా ఏళ్ల త‌ర్వాత కుదిరిన‌ట్టు తెలుస్తోంది. ఆ కాంబినేష‌న్ ఎవ‌రిదో కాదు, సూప‌ర్ స్టార్ రజినీకాంత్, లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్.

కెరీర్ స్టార్టింగ్ లో వీరిద్ద‌రూ క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. కానీ త‌ర్వాత ఓ థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన వివాదం వ‌ల్ల మ‌ళ్లీ ఎప్పుడూ వీరిద్ద‌రూ క‌లిసి వ‌ర్క్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ర‌జినీకాంత్ కొత్త సినిమా కూలీ కోసం క‌మ‌ల్ హాస‌న్ రంగంలోకి దిగుతున్న‌ట్టు తెలుస్తోంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తున్న సినిమా కూలీ.

ఈ సినిమాపై రోజురోజుకీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రిలీజైన పోస్టర్లు, టీజ‌ర్, పాట‌లకు ఆడియ‌న్స్ నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో పాటూ కూలీలో నాగార్జున‌, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాస‌న్ లాంటి భారీ క్యాస్టింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌టం, పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్ చేస్తుండ‌టం కూలీపై బ‌జ్ ను విప‌రీతంగా పెంచేశాయి.

అయితే ఇప్పుడు కూలీ సినిమాకు సంబంధించి ఓ వార్త కోలీవుడ్ వ‌ర్గాల్లో బాగా వినిపిస్తోంది. కూలీ మూవీ కోసం క‌మ‌ల్ హాస‌న్ రంగంలోకి దిగి వాయిస్ ఓవ‌ర్ ను ఇవ్వ‌బోతున్నార‌ని అంటున్నారు. డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌మ‌ల్ ను అడ‌గ‌టంతో వెంట‌నే ఆయ‌న ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. అస‌లే త‌న ప్రాణ స్నేహితుడు ర‌జినీకాంత్ సినిమా పైగా గ‌తంలో విక్ర‌మ్ రూపంలో త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్ అవ‌డంతో క‌మ‌ల్ లోకేష్ అడ‌గానే ఓకే చెప్పార‌ని స‌మాచారం. ఈ వార్తలో నిజ‌మెంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే ఈ విష‌యం అటు ర‌జినీ ఫ్యాన్స్ లో, ఇటు క‌మ‌ల్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపింది. ఆగ‌స్ట్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించిన విష‌యం తెలిసిందే.