Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ, క‌మ‌ల్‌లా చిరు ఎందుకు చేయ‌డం లేదు!

సీనియ‌ర్ హీరోలు చాలా వ‌ర‌కు త‌మ‌దైన మార్కు సినిమాల‌తో బాక్సీఫీస్‌ని దుమ్ముదులిపేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 May 2025 7:20 AM
ర‌జ‌నీ, క‌మ‌ల్‌లా చిరు ఎందుకు చేయ‌డం లేదు!
X

సీనియ‌ర్ హీరోలు చాలా వ‌ర‌కు త‌మ‌దైన మార్కు సినిమాల‌తో బాక్సీఫీస్‌ని దుమ్ముదులిపేస్తున్నారు. రికార్డు స్థాయి వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తూ వ‌చ్చిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` మూవీతతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన విష‌యం తెలిసిందే. హిట్టు కొడితే చాలు అని చేసిన `జైల‌ర్‌` ర‌జ‌నీకి తిరుగులేని విజ‌యాన్ని అందించి కొత్త‌దారి చూపించింది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో నెల్స‌న్ తెర‌కెక్కించారు.

ఎలాంటి అంచ‌నాలు లేకుండా త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ ర‌జ‌నీ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ర‌జ‌నీ మేనిరిజ‌మ్స్‌, ర‌జ‌నీ మార్కు మెరుపుల‌తో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద రూ.650 కోట్లు రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. అదే ఊపుతో ర‌జ‌నీ చేసిన `వేట్ట‌యాన్‌` ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయినా వ‌సూళ్ల ప‌రంగా కూడా `జైల‌ర్‌`ని అధిగ‌మించ‌లేక‌పోయింది.

దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి లోకేష్ క‌న‌గ‌రాజ్ `కూలీ`, నెల్స‌న్ `జైల‌ర్ 2` చిత్రాల‌పై ప‌డింది. ఈ రెండు సినిమాల‌పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది. రెండింటిలోనూ ర‌జ‌నీ త‌న ఏజ్‌కు త‌గ్గ క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఏజ్‌కి త‌గ్గ క‌థ‌ల‌ని, పాత్ర‌ల‌ని ఎంచుకుంటూ ర‌జ‌నీ త‌న మార్కు స్టైల్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని ద‌క్కించుకుంటున్నాడు. ఇదే ఫార్ములాని క‌మ‌ల్ హాస‌న్ కూడా ఫాలో అవుతున్నాడు.

క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం 2 త‌రువాత ఒక్క హిట్‌ని అందుకోలేక‌పోయారు. రెగ్యుల‌ర్ హీరో పాత్ర‌ల్లో న‌టిస్తూ చేసిన సినిమాలేవీ ఆడ‌క‌పోవ‌డంతో కొత్త‌గా ట్రై చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అప్పుడే త‌న ఏజ్‌కు త‌గ్గ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకున్నారు. అలా నిర్ణ‌యించుకుని చేసిన సినిమా `విక్ర‌మ్‌`. ఏడుప‌దుల వ‌య‌సులో త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో క‌మ‌ల్ చేసిన ఈ మూవీ రికార్డు స్థాయి విజ‌యాన్ని అందించి క‌మ‌ల్ కు స‌రికొత్త ఉత్సాహాన్ని అందించింది. విక్ర‌మ్ అందించిన ఉత్సాహంతో క‌మ‌ల్ ఇప్పుడు శింబుతో క‌లిసి `థ‌గ్ లైఫ్ చేస్తున్నాడు.

చిరు కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయిపోయి స‌రికొత్త యాక్ష‌న్ డ్రామాల‌కు తెర‌లేపాల‌ని ఫ్యాన్స్‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. కానీ చిరు మాత్రం ఇప్ప‌టికీ త‌న ఏజ్‌కు త‌గ్గ పాత్ర‌లు చేయ‌కుండా నేల‌విడిచి సాము చేస్తున్నారు. ఇప్ప‌టికైనా క‌మ‌ల్‌, ర‌జ‌నీల‌ని ఫాలో అయితే కెరీర్ మ‌రింత ఊపందుకుంటుంద‌ని, మ‌రిన్ని కొత్త క‌థ‌లు తెర‌పైకొస్తాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, సినీ ల‌వ‌ర్స్ ఫీల‌వుతున్నారు. మ‌రి చిరు అటు వైపుగా అడుగులు వేస్తారా లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే. ప్ర‌స్తుతం చిరు `విశ్వంభ‌ర‌`లో న‌టిస్తున్నారు.