Begin typing your search above and press return to search.

ర‌జినీ రికార్డు బ్రేకింగ్ రెమ్యూన‌రేష‌న్.. నిజ‌మెంత‌?

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ ఏడు ప‌దుల వయ‌సులో కూడా వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   9 May 2025 2:45 AM
ర‌జినీ రికార్డు బ్రేకింగ్ రెమ్యూన‌రేష‌న్.. నిజ‌మెంత‌?
X

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ ఏడు ప‌దుల వయ‌సులో కూడా వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్ర‌స్తుతం రజ‌నీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కూలీ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. కూలీ సినిమా ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కూలీ త‌ర్వాత ర‌జినీకాంత్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ కు సీక్వెల్ గా జైల‌ర్2 చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టివ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న ర‌జినీకాంత్ కు జైల‌ర్ సినిమా ఇచ్చి బూస్ట‌ప్ అంతా ఇంతా కాదు. నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ర‌జినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ సినిమా రూ. 600 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది.

ఆ సినిమాలో రజినీ స్టైలిష్ యాక్టింగ్, మోహ‌న్ లాల్, శివ‌రాజ్ కుమార్ క్యామియో, అనిరుధ్ మ్యూజిక్ జైల‌ర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అలాంటి జైల‌ర్ కు సీక్వెల్ గా జైల‌ర్2 కు తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. జైల‌ర్2 ను ఈసారి డైరెక్ట‌ర్ నెల్స‌న్ జైల‌ర్ కు మించేలా మ‌రింత భారీ గా ప్లాన్ చేస్తున్నాడ‌ట. క‌ళానిధి మార‌న్ స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో భారీ బ‌డ్జెట్ తో జైల‌ర్2 ను నిర్మిస్తున్నాడు.

జైల‌ర్2 కు ర‌జినీకాంత్ తీసుకోబోయే రెమ్యూన‌రేషన్ గురించి ప్ర‌స్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జైల‌ర్2 కోసం ర‌జినీ ఏకంగా రూ.260 కోట్లు తీసుకుంటున్న‌ట్టు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజ‌మైతే కోలీవుడ్ లోనే కాకుండా భార‌త‌దేశంలోనే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న హీరోగా ర‌జినీ రికార్డుకెక్కుతాడు. జైల‌ర్2 కు అనిరుధ్ సంగీతం అందిస్తుండ‌గా, శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ తో పాటూ మ‌రికొంద‌రు స్టార్లు కూడా గెస్ట్ రోల్స్ చేసే అవ‌కాశ‌ముంది. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే రికార్డులు సృష్టించిన జైల‌ర్2 వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.