జైలర్2లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసులో కూడా ఫుల్ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 May 2025 3:25 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసులో కూడా ఫుల్ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు రజినీకాంత్. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసిన రజనీకాంత్ తన తర్వాతి సినిమాను జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.
జైలర్ సినిమాతో రజినీకాంత్ సృష్టించిన అల్లకల్లోలం మామూలుది కాదు. సినిమాలో తన వయసుకి తగ్గ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్న రజినీకాంత్ ఆ సినిమాతో తన కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా జైలర్ ను నిలిపారు. అలాంటి జైలర్ కు సీక్వెల్ గా ఇప్పుడు జైలర్2 వస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గత కొంతకాలంగా వర్క్ చేస్తున్నాడు.
మొన్నా మధ్య అనౌన్స్ అయిన ఈ సినిమాకు ఆల్రెడీ యాక్టర్ల ఎంపిక కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన విద్యాబాలన్ ను ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జైలర్1లో రజినీకి భార్యగా రమ్యకృష్ణ కనిపించగా, ఇప్పుడు ఆయన పక్కన విద్యా బాలన్ ను ఎందుకు తీసుకుంటున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
జైలర్ లో ఎలాగైతే శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్ లో కనిపించారో, ఇప్పుడు జైలర్2 లో కూడా అలానే సర్‌ప్రైజింగ్ రోల్స్ ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి బాలయ్య ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడనే వార్త బయటికొచ్చింది. తాజాగా కింగ్ నాగార్జున జైలర్2లో విలన్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. కూలీలో ఇప్పటికే రజినీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న నాగ్, ఇప్పుడు మరోసారి జైలర్2 లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట.
