Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ హిట్‌ సీక్వెల్‌లో 'పుష్ప' స్టార్‌?

తమిళ్ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్‌ సినిమా సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   24 April 2025 2:41 PM
సూపర్‌ స్టార్‌ హిట్‌ సీక్వెల్‌లో పుష్ప స్టార్‌?
X

తమిళ్ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్‌ సినిమా సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే. రజనీకాంత్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమాగా నిలిచిన జైలర్ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. ఇటీవలే కూలీ సినిమాను పూర్తి చేసిన రజనీకాంత్‌ 'జైలర్‌ 2' సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. జైలర్‌ 2 సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సినిమా అనౌన్స్మెంట్‌ వీడియోకు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్‌లోనే కాకుండా జైలర్‌ 2 అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెంచింది. జైలర్‌ 2 సినిమా వెయిట్‌ను మరింతగా పెంచే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

జైలర్‌ 2 సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ నటించిన విషయం తెల్సిందే. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన పాత్ర కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జైలర్ 2 లో మరికొందరు స్టార్స్ ఉంటారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్‌తో వేట్టయాన్ సినిమాలో నటించిన మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‌ను ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కేరళలో జరుగుతున్న షెడ్యూల్‌లో రజనీకాంత్‌తో పాటు ఆయన పాల్గొంటున్నాడని తెలుస్తోంది.

మలయాళంలో స్టార్‌ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న ఫహద్‌ ఫాసిల్‌ తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో పుష్ప 2 సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరిన్ని ఆఫర్లు ఆయన తలుపు తడుతున్నాయి. హిందీ సినిమాల్లోనూ ఈయనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రజనీకాంత్‌ సినిమాలో ఇటీవలే నటించి మరోసారి ఆయన సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవడంతో ఆయనపై ఏ స్థాయిలో నమ్మకం పెరిగిందో చెప్పుకోవచ్చు. జైలర్‌ 2 సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జైలర్‌ సినిమాలో నటించిన రమ్యకృష్ణ, శివ రాజ్ కుమార్‌, మిర్నాలు కంటిన్యూ కాబోతున్నారు. వారికి తోడు ఫహద్‌ ఫాసిల్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సూపర్‌ హిట్ సీక్వెల్‌కి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో మాదిరిగా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తాను అంటూ అభిమానులకు ఇప్పటికే అనిరుధ్‌ హామీ ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్‌ వీడియోకి మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన నేపథ్యంలో ఆయన మరింత స్పీడ్‌గా సినిమా కోసం వర్క్‌ చేస్తున్నాడు. నెల్సన్‌ దిలీప్ ఈ సినిమాతో హిట్‌ కొడితే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.