సూపర్ స్టార్ తో స్టార్ డైరెక్టర్ రాజకీయమా!
70 ప్లస్ లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ మెరుపు వేగంతో షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూలీ పూర్తి చేసి 'జైలర్ 2'ని పట్టాలెక్కించి పూర్తి చేసే పనిలో ఉన్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 5:00 PM IST70 ప్లస్ లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ మెరుపు వేగంతో షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూలీ పూర్తి చేసి 'జైలర్ 2'ని పట్టాలెక్కించి పూర్తి చేసే పనిలో ఉన్నారు. కొన్ని నెలలుగా ఆ సినిమా షూట్ లోనే బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే తదుపరి ప్రాజెక్ట్ ను కూడా లైన్ లో పెట్టే పని మొదలు పెట్టారు. 'ఖాకీ' దర్శకుడు హెచ్. వినోధ్ తో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుం టున్నారు.
కానీ అది కుదర్లేదు. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రం వినోధ్ తోనే మొదలు పెట్టాలని స్ట్రాంగ్ గా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్-వినోద్ మధ్య రెండు దశల్లో స్టోరీ డిస్కషన్స్ జరిగాయని తెలిసింది. ఈ నేపథ్యంలో స్టోరీ కూడా లీకవుతుంది. ఇదొక పోలిటికల్ థ్రిల్లర్ చిత్రమని తెలుస్తోంది. సీరియస్ రాజకీయ కోణంలో సాగే చిత్రమని..ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే కాన్సెప్ట్ అంటున్నారు.
రజనీ కూడా స్టోరీ ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ ....దళపతి విజయ్ హీరోగా 'జన నాయగన్' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రమే. విజయ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడంతో అతడి రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రంగా చేస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
అటుపై రజనీకాంత్ ఒకే అనుకుంటే? వినోద్ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించాల్సి ఉంటుంది. వినోద్ కు ఇంత వరకూ డైరెక్టర్ గా వైఫల్యం ఎదురవ్వలేదు. చేసిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. శత్రుంగ వెట్టై, ఖాకీ, నెర్కొం పార్వల్, వలిమై, తనీవు బ్లాక్ బస్టర్లు. జన నాయగన్ తో డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసాడు.
