తలైవా జెట్ స్పీడ్.. 75లో అందరికంటే వేగంగా..
సినిమా వయసుకు సంబంధించినది కాదు.. ప్లాన్, కమిట్‌మెంట్ ఉండాలే గాని జెట్ స్పీడ్ లో వెళ్లొచ్చు అని తలైవా రజినీకాంత్ నిరూపిస్తున్నారు.
By: Tupaki Desk | 22 May 2025 8:45 PM ISTసినిమా వయసుకు సంబంధించినది కాదు.. ప్లాన్, కమిట్‌మెంట్ ఉండాలే గాని జెట్ స్పీడ్ లో వెళ్లొచ్చు అని తలైవా రజినీకాంత్ నిరూపిస్తున్నారు. వయసు 75.. అలాగే భారతదేశంలో స్టార్ హోదాలో కొనసాగుతున్న అగ్రహీరోలలో ఆయన అగ్రగామి. అలాంటి హీరో అందరి కంటే వేగంగా సినిమాలు చేస్తుండడం మరొక విశేషం. ఇటీవలే కూలీ సినిమాను పూర్తి చేసిన రజినీ, తాజాగా జైలర్ 2 గురించి అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్ 2025లో షూటింగ్ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.
ఇక మరోవైపు కూలీ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచే జనం దృష్టిని ఆకర్షిస్తోంది. లోకేష్ కనగరాజ్ వంటి మాస్ డైరెక్టర్ టచ్‌తో వస్తున్న ఈ సినిమా కూడా పూర్తిగా పాన్ ఇండియా రేంజ్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుండగా, రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ రికార్డ్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఇప్పుడు రజినీకాంత్ మరోసారి జైలర్ 2 షూటింగ్ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2023లో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తున్న సీక్వెల్ పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలో 1000 కోట్ల క్లబ్‌ను టచ్ చేసే అవకాశం ఉన్న ప్రాజెక్ట్‌గా మారింది.
ఈ సినిమాకి సంబంధించిన నటుల జాబితా చూస్తేనే ఆ అంచనాలకు న్యాయం చేసినట్టు ఉంటుంది. రమ్యకృష్ణ, ఫహద్ ఫాజిల్, మిర్నా మీనన్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ కాస్ట్ ఇందులో నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ కూడా పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. గ్రాండ్ విజువల్స్, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్ డైలాగ్స్ అన్నీ కలిసొచ్చేలా జైలర్ 2 రూపొందుతోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అణిరుధ్ రవిచంద్రన్ మళ్లీ రిపీట్ కావడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.
అణిరుధ్ గతంలో జైలర్‌కు అందించిన ఆల్బమ్ ఎంత మాస్ అట్రాక్షన్ తెచ్చిందో తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2కూ ఆయన రీ ఎంట్రీ ఇస్తుండడంతో మ్యూజిక్ పరంగా ప్రేక్షకులు మరింతగా ఆసక్తి చూపిస్తున్నారు. డార్క్ మూడ్, యాక్షన్ టచ్‌తో ఈ సీక్వెల్ మూడ్ పూర్తిగా వేరే లెవెల్‌లో ఉంటుందన్నది యూనిట్ హింట్.
ఓవర్ ఆల్‌గా చెప్పాలంటే.. వయసు 75 అయినా ఒకేసారి రెండు భారీ సినిమాలతో మళ్లీ బాక్సాఫీస్ దూసుకెళ్లబోతున్న తలైవా స్పీడ్ నిజంగా ప్రశంసనీయం. నేటితరం యువ హీరోలు ఒక సినిమాకు రెండేళ్లు తీసుకుంటున్న వేళ, ఈ లెజెండ్ మాత్రం స్క్రిప్ట్ లాక్, షూటింగ్ పేస్, రిలీజ్ ప్లాన్ అన్నీ ముందే ఫిక్స్ చేసుకుంటూ ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఇస్తున్నారు. దీంతో రజినీకాంత్ మీద అభిమానుల అంచనాలు మరోసారి హై లెవెల్ కు చేరుకున్నాయి.
