ఫస్ట్ హాఫ్ తో సూపర్ స్టార్ పుల్ ఖుషీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
By: Tupaki Desk | 14 Jun 2025 9:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్ట్ 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. గోల్డ్ స్మగ్మింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఇందులో రజనీ కాంత్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్ సహా ప్రచార చిత్రాలన్నీ మంచి బజ్ ని తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే అంతకన్నా గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రధ మార్ధం రజనీకాంత్ చూసి సర్ ప్రైజ్ అయ్యారుట. ఔట్ పుట్ చూసి రజనీ చాలా సంతోషంగా ఉందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారుట.
ద్వితియార్దం ఇంకా రెడీ కాకపోవడంతో పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సెకెండాఫ్ కూడా చూసి రజనీకాంత్ రివ్యూ ఇస్తే సంగతేంటి? అన్నది తేలిపోతుంది. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ భారీ కాన్వాస్ పై రూపొందించారు. అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ల మధ్యలో రజనీకాంత్ వస్తే ఇంకెలా ఉంటుందో ఊహకే అందదు.
మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్-సత్య రాజ్ ఒకే ప్రేమ్ లో కనడటం అన్నది మరో హైలైట్. తొలిసారి ఇద్దరు 1986లో విడుదలైన 'మిస్టర్ భరత్'లో కలిసి కనిపించారు. ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా సత్య రాజ్ ఎందుకనో ఛాన్స్ తీసుకోలేదు. 'ఎందిరన్' ,' శివాజీ' లాంటి చిత్రాల్లో సత్యారాజ్ కి కీలక పాత్ర ఆఫర్ చేసారు. అయినా నటించలేదు. మళ్లీ ఇంత కాలానికి లోకేష్ కనగరాజ్ వాళ్లను కలిపాడు.