Begin typing your search above and press return to search.

కూలీ రెమ్యునరేషన్ లిస్ట్.. మైండ్ బ్లాక్..!

కూలీ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   12 Aug 2025 4:43 PM IST
కూలీ రెమ్యునరేషన్ లిస్ట్.. మైండ్ బ్లాక్..!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా భారీ అంచనాలతో ఉన్నారు. లోకేష్ కమల్ హాసన్ కి విక్రం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఇప్పుడు రజినీకి ఎలాంటి హిట్ ఇస్తాడంటూ చర్చలు జరుగుతున్నాయి. కూలీ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది.

కాస్టింగ్ రెమ్యునరేషన్ కోసమే ఖర్చు..

ఐతే సినిమా బడ్జెట్ లో సగం కాస్టింగ్ రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేశారని తెలుస్తుంది. కూలీ సినిమాకు గాను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దాదాపు 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ గా తీసుకున్నాడని తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా 150 నుంచి 200 కోట్ల దాకా రెమ్యునరేషన్ గా అందుకున్నారట. కూలీ లో ప్రతినాయకుడి రోల్ చేసిన నాగార్జునకు 25 నుంచి 30 కోట్ల మధ్యలో పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో ఉంది. ఐతే అందుకు అమీర్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశారట.

కేవలం రజినీకాంత్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన తన క్యామియోని ఫ్రీగా చేశారని తెలుస్తుంది. కూలీ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఆయనకు కూడా 4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మలయాళ యాక్టర్ సౌబిన్ షాహిర్ కి 1 కోటి రెమ్యునరేషన్ గా ఇచ్చారట. కూలీ సినిమాలో శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఆమెకు పారితోషికంగా 4 కోట్లు.. సినిమాలో మోనికా అంటూ స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్దేకి 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారట. కూలీలో సత్యరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించాడు. ఆయనకు కూడా 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారట.

రెండు రోజుల్లో కూలీ రిలీజ్..

ఇలా స్టార్ రెమ్యునరేషన్స్ తోనే కూలీ సినిమా 250 కోట్ల దాకా చేరింది. ఇక ప్రొడక్షన్ కాస్ట్ తో కలిపి సౌత్ నుంచి వస్తున్న రిచ్ మూవీగా కూలీ వస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. మరో రెండు రోజుల్లో కూలీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై బజ్ అయితే బాగుంది. మరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర లోకేష్ విత్ రజినీ మాస్ చూపించే ఛాన్స్ ఉంటుంది. ఆగష్టు 14నే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేసిన వార్ 2 వస్తుంది. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో కూలీ, వార్ 2 మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది.