75 ఏళ్ల రజినీ.. అలాంటి రిస్క్ ఎందుకు..?
రిస్క్ ని రస్క్ లో టీలో నంజుకుని మరీ తినేయడం మన సూపర్ స్టార్ రజినీకి అలవాటే. తన సంకల్పం ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే.
By: Ramesh Boddu | 7 Aug 2025 10:21 AM ISTరిస్క్ ని రస్క్ లో టీలో నంజుకుని మరీ తినేయడం మన సూపర్ స్టార్ రజినీకి అలవాటే. తన సంకల్పం ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. అందుకే సాధారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఆయన సినీ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది. 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో కూడా సినిమా కోసం కష్టపడుతున్నాడు రజినీకాంత్. 74 ఏళ్ల వయసులో రజినీ తన ఫ్యాన్స్ ని.. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు. అందుకు ఈజీ మెథడ్ ని కాదు కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఈమధ్య స్టార్ సినిమాల్లో ఎక్కువ కష్టం లేకుండా సీజీలు వాడేస్తున్నారు. రియల్ లొకేషన్ పర్మిషన్స్ ఇంకా అక్కడికి వెళ్లి షూట్ చేయడం లాంటివి కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందని దానిలో సగానికే సీజీ తో చేసేస్తున్నారు. ఐతే ఆడియన్స్ ఏవి రియల్ లొకేషన్స్, ఏది గ్రాఫిక్స్ అన్నది ఇట్టే కనిపెడుతున్నారు. ఈమధ్య కొన్ని సినిమాలు అలానే సీజీ వర్క్ బాగాలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
అందుకే వాళ్లకి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుని రజినీకాంత్, లోకేష్ కూలీ సినిమాకు మాక్సిమం రియల్ లొకేషన్స్ లోనే రియల్ ఎనివిరాన్మెంట్ తోనే చేశారట. సీజీ వర్క్ సినిమాలో చాలా తక్కువ ఉంటుందని లోకేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. భారీ బడ్జెట్ సినిమా.. పాన్ ఇండియా రిలీజ్.. స్టార్ హీరోలతో పని అంటే.. వాళ్లని రిస్క్ లో పెట్టడం ఎందుకని సీజీలతో లాగిస్తున్నారు డైరెక్టర్స్.
కానీ లోకేష్ మాత్రం ఆ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తున్నాడు. రజినీ కూడా దానికి సపోర్ట్ చేయడంతో కూలీ సినిమా అంతా కూడా రియల్ లొకేషన్స్ తోనే చేశారట. సినిమా అంటే అంత డెడికేటెడ్ గా ఉంటారు కాబట్టే 50 ఏళ్లుగా భాషతో సంబంధం లేకుండా రజినీకాంత్ ని ఆడియన్స్ తమ హృదయాల్లో ఉంచుకున్నారు.
రజినీకాంత్ కూలీ సినిమా ఈ నెల 14న వస్తుంది. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున విలన్ గా చేశారు. సినిమాలో కన్నడ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లు కూడా ఉన్నారు. శృతి హాసన్ సత్యరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హైప్ తెచ్చింది.
ఐతే ఆగష్టు 14న కూలీ సినిమాకు పోటీగా వార్ 2 వస్తుంది. హృతిక్ రోషన్, ఎన్ టీ ఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
