Begin typing your search above and press return to search.

కూలీ: తెలుగు రైట్స్ ఎంతంటే?

ఈ సినిమా మీద తెలుగులోనూ క్రేజ్ తారాస్థాయిలో ఉంది. తాజాగా తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైయ్యాయన్న వార్తలు అందుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Jun 2025 1:22 PM IST
కూలీ: తెలుగు రైట్స్ ఎంతంటే?
X

తమిళ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై ఆరంభం నుంచి ఆసక్తి నెలకొనగా, ఆగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా విడుదల కాబోతుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, సూపర్ స్టార్ కెరీర్‌లో మరో బిగ్ మూవీగా నిలవబోతోందన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమా మీద తెలుగులోనూ క్రేజ్ తారాస్థాయిలో ఉంది. తాజాగా తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైయ్యాయన్న వార్తలు అందుతున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఏషియన్ సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ రైట్స్‌ను దక్కించుకున్నారని టాక్. ఈ డీల్ విలువ రూ. 48 కోట్లకు పైగా ఉండొచ్చని సమాచారం.

జీఎస్టీ కౌంట్ కాకుండా ఇదంతా కేవలం థియేట్రికల్ రేటే కావడం విశేషం. ఈ రేంజ్ బిజినెస్ ఇటీవల ఏ తమిళ సినిమాకూ జరగలేదు. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. లోకేష్ గత సినిమాల కలెక్షన్స్ అలాగే రజినీకాంత్ జైలర్ సినిమా కూడా బిగ్ హిట్ కావడంతో ఈ సినిమాపై తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక బడా నిర్మాతలు పోటీ పడకుండా తెలివిగా కలిసి కొనుగోలు చేశారు.

ఇక 'కూలీ' ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటపై ఇప్పటికే సాలీడ్ అంచనాలు ఉన్నాయి. రజినీకాంత్ స్టైల్, మాస్ మేనరిజంను ఆకట్టుకునేలా పాట ఉండబోతోందని మ్యూజిక్ సర్కిల్స్ చెబుతున్నాయి. సూపర్ స్టార్ అభిమానులు ఈ పాటను ఫుల్ స్వింగ్‌లో సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ చిత్రంలో రజినీతో పాటు నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ కీలక పాత్రలు పోషిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పెషల్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు టాక్. ఈ స్టార్ కాస్టింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. విభిన్నమైన కథ, మాస్ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లోకేశ్ మేకింగ్ సినిమాకు ప్రధాన అస్త్రంగా నిలవబోతున్నాయి.

ఈసారి రజినీకాంత్ తెలుగు బాక్సాఫీస్‌ను దుమ్ములేపుతారని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు భావిస్తున్నాయి. తలైవా క్రేజ్, మాస్ కంటెంట్, టెక్నికల్ హై స్టాండర్డ్స్ అన్నీ కలిపి ఈ సినిమాను పాన్ ఇండియా హిట్‌గా నిలబెట్టే అవకాశం ఉంది. 'జైలర్' తర్వాత రజినీ నుంచి మళ్ళీ ఈ రేంజ్ హైప్ రావడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కంటెంట్ ఏ స్థాయిలో క్లిక్కువుతుందో చూడాలి.