Begin typing your search above and press return to search.

కూలీ.. డైరెక్ట్ గా సినిమా చూపిస్తారా..?

అందుకే లోకేష్ కొత్తగా కూలీ ట్రైలర్ ని వదలకుండా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

By:  Tupaki Desk   |   10 July 2025 8:00 AM IST
కూలీ.. డైరెక్ట్ గా సినిమా చూపిస్తారా..?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమాలో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా భాగం అవుతున్నారు. సినిమాలో ఎవరెవరు ఏయే పాత్రల్లో కనిపిస్తారు అన్నది ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఉపేంద్ర, అమీర్ ఖాన్ లవి గెస్ట్ రోల్స్ కాగా నాగార్జున మాత్రం నిడివి ఎక్కువ ఉన్న పాత్రలోనే కనిపిస్తారని తెలుస్తుంది.

కూలీ సినిమాలో నాగార్జున రోల్ లో ఆయన్ని మాత్రమే ఒప్పించాలని లోకేష్ చాలా రిక్వెస్ట్ చేసి మరీ నాగార్జునని ఒప్పించారట. ఇదిలా ఉంటే స్టార్ సినిమా అయినా చిన్న సినిమా అయినా సినిమా పై ఒక అంచనా రావాలంటే ట్రైలర్ వదలాలి. ఐతే లోకేష్ కనకరాజ్ రజిని సినిమా అంటేనే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా ట్రైలర్ చూడకపోయినా సినిమాకు వెళ్తారు.

అందుకే లోకేష్ కొత్తగా కూలీ ట్రైలర్ ని వదలకుండా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. సినిమా గురించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ థ్రిల్ అవ్వాలని అలా సెట్ చేస్తున్నాడట లోకేష్. ఓ విధంగా ఇది మంచి ప్లానే.. రజిని సినిమా కాబట్టి ఫ్యాన్స్ ఫస్ట్ షోకి ఎగబడతారు. అందులోనూ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉన్నారంటే ఇంకాస్త క్రేజ్ ఉంటుంది.

అందుకే లోకేష్ కూలీ సినిమా ట్రైలర్ లేకుండానే సినిమా వదలాలని అనుకుంటున్నారట. నిర్మాతలను ఈ విషయంలో కన్విన్స్ చేసే పనిలో ఉన్నారట. వాళ్లు నీ ఇష్టం అన్నారంటే మాత్రం లోకేష్ కూలీని డైరెక్ట్ గా థియేటర్ లోనే చూపిస్తాడని తెలుస్తుంది. సినిమా గురించి ఎలాంటి శాంపిల్ టీజర్, ట్రైలర్ లేకుండా రిలీజ్ చేయడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి.

లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాను ఒక డైరెక్టర్ గా కాకుండా రజినికాంత్ వీరాభిమానిగా చేస్తున్నాడట. తప్పకుండా ఈ సినిమా అంచనాలను అందుకుంటుందనే చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో పూజ హెగ్దే స్పెషల్ సాంగ్ చేస్తుండగా శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా చేస్తుంది. రజిని కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ లాక్ చేశారు. అదే డేట్ కి హృతిక్ రోషన్, ఎన్ టీ ఆర్ నటించిన వార్ 2 కూడా పాన్ ఇండియా భారీ రిలీజ్ అవుతుంది.