Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ కోసం రంగంలోకి మ‌రో సూప‌ర్ స్టార్

ప‌ద‌మూడేళ్ల విరామం అనంత‌రం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌`తో బ్లాస్టింగ్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు.

By:  Tupaki Desk   |   15 April 2025 6:30 PM
Aamir Khan Cameo In Rajinikanth Coolie Movie
X

ప‌ద‌మూడేళ్ల విరామం అనంత‌రం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌`తో బ్లాస్టింగ్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ష‌న్‌లో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మించిన ఈ సినిమా 2023, ఆగ‌స్టు 10న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ర‌జ‌నీ చాలా రోజుల త‌రువాత త‌న‌దైన మార్కు మేన‌రిజ‌మ్స్‌తో టైగ‌ర్ ముత్తువేల్ పాండ్య‌న్ గా న‌టించి అద‌ర‌గొట్టారు. ర‌జ‌నీ మెస్మ‌రైజింగ్ పెర్ఫార్మెన్స్‌కు అనిరుద్ నేప‌థ్య సంగీతం తోడై ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు పూన‌కాలు పుట్టించింది.

ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రూ.650 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ర‌జ‌నీ కెరీర్‌లోనే `రోబో` త‌రువాత అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమా స‌రికొత్త రికార్డులు సృష్టించి ర‌జ‌నీ మేనియా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించింది. దీని త‌రువాత ర‌జ‌నీ చేసిన వేట్ట‌యాన్ ఫ‌ర‌వాలేద‌నిపించింది. `జైల‌ర్‌` స‌క్సెస్ జోష్‌లో ఉన్న ర‌జ‌నీ అదే ఊపులో లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

`కూలీ` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో అన్నీ స‌ర్‌ప్రైజ్‌లే అని తెలుస్తోంది. కీల‌క క్యారెక్ట‌ర్ల‌లో కింగ్ నాగార్జున‌, క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర, స‌త్య‌రాజ్‌, శృతిహాస‌న్, రెబామోనికా జాన్ న‌టిస్తున్నారు. బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే అతిథి పాత్ర‌లో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో మెర‌వ‌బోతోంది. ఇప్ప‌టికే ఆ పాట‌ని కూడా పూర్తి చేశార‌ట‌. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మ‌రో స‌ర్‌ప్రైజింగ్ క్యారెక్ట‌ర్ ఉంద‌ని తెలిసింది.

ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమీర్‌ఖాన్ ఈ సినిమాలోని ఓ కీల‌క స‌న్నివేశంలో అతిథి పాత్ర‌లో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నాడ‌ని తెలిసింది. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించి ఈ మూవీతో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ర‌జ‌నీ స్టైల్లో సాగుతూ లోకేష్ క‌న‌గ‌రాజ్ మార్కు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీని ఆగ‌స్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.