రజినీ 'కూలీ' మూవీ.. శ్రుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అదే సమయంలో ఇప్పుడు ఆమె కూలీ మూవీ కోసం మాట్లాడారు. లోకేష్ కనగరాజ్ వర్కింగ్ స్టైల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శ్రుతి.
By: Tupaki Desk | 19 July 2025 4:00 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న కూలీ సినిమా కోసం భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దించారు మేకర్స్. టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ నటిస్తున్నారు. హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో ప్రీతిగా కనిపించనున్నారు.
ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. చేతిలో ఆయుధంతో ఉన్న శ్రుతి.. సీరియస్ లుక్ లో కనిపించారు. దీంతో సినిమాలో ఆమె పాత్ర దక్కిందని అంతా ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో ఇప్పుడు ఆమె కూలీ మూవీ కోసం మాట్లాడారు. లోకేష్ కనగరాజ్ వర్కింగ్ స్టైల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శ్రుతి.
"లోకేష్ సినిమాలన్నింటిలో ఒక కామన్ అంశం ఉంటుంది. ఆయన సినిమాల్లో యాక్షన్, హై-ఆక్టేన్ స్టఫ్ కచ్చితంగా ఉంటుంది. అంతే కాదు ఒక ఎమోషనల్ కోర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కూలీలో కూడా అవి ఉన్నాయి. అయితే కూలీ స్కేల్ చాలా పెద్దది. ఆ పరంగా సినిమా భిన్నంగా ఉంటుంది" అని చెబుతూ అంచనాలు పెంచేశారు అమ్మడు.
అంతకుముందు కొన్ని రోజుల క్రితం.. తన రోల్ అందరికీ కనెక్ట్ అవుతుందని శ్రుతి తెలిపారు. లోకేష్ దర్శకత్వంలో వర్క్ చేయడం తన డ్రీమ్ అన్న అమ్మడు.. అందుకే ఆయన సినిమా గురించి చెప్పగానే అంగీకరించినట్లు వెల్లడించారు. కూలీ వంటి ఇలాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ఉంటాయని శ్రుతి అభిప్రాయపడ్డారు.
వాటిని సిల్వర్ స్క్రీన్ పై చూపించడం నిజంగా సవాలేనని చెప్పిన శ్రుతి.. లోకేష్ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని సినిమాను తెరకెక్కించారని కొనియాడారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కూలీ మూవీతో శ్రుతి హాసన్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
