Begin typing your search above and press return to search.

కూలీ మోనికా సాంగ్ వచ్చేసిందోచ్..!

అనిరుద్ రవిచందర్ నుంచి మరో అదిరిపోయే సాంగ్ గా మోనికా వచ్చింది. ఈ సాంగ్ ని సుబ్బలక్ష్మి ఆలపించగా.. అసల్ కోలార్ ర్యాప్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   11 July 2025 7:15 PM IST
కూలీ మోనికా సాంగ్ వచ్చేసిందోచ్..!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఆగష్టు 14న రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. కూలీ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ రిలీజై బ్లాక్ బస్టర్ కాగా ఇక ఇప్పుడు కూలీ నుంచి సెకండ్ సాంగ్ మోనికా ని రిలీజ్ చేశారు.

కూలీ మోనికా సాంగ్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్దే మెరుపులు మెరిసింది. రెడ్ కలర్ అవుట్ ఫిట్ తో అమ్మడి గ్లామర్ షో సాంగ్ కే కాదు సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంది. పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ మోనికాలో సౌబిన్ షాహిర్ కూడా కనిపించాడు. పూజా హెగ్దే తో ఈ సాంగ్ సెట్ చేయాలన్న ఆలోచన ఎవరిదో కానీ కూలీకి కావాల్సినంత బూస్టింగ్ వచ్చినట్టే ఉంది.

అనిరుద్ రవిచందర్ నుంచి మరో అదిరిపోయే సాంగ్ గా మోనికా వచ్చింది. ఈ సాంగ్ ని సుబ్బలక్ష్మి ఆలపించగా.. అసల్ కోలార్ ర్యాప్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కూలీ సినిమాలో ప్రతిదీ చాలా స్పెషల్ అనేలా ఉండాలని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ఈ సాంగ్ కూడా సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో మన కింగ్ నాగార్జున కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు. సినిమాలో నాగార్జున పాత్ర చూసి అందరు సర్ ప్రైజ్ అవుతారని అంటున్నారు. అంతేకాదు కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా కూలీ సినిమాలో సర్ ప్రైజింగ్ రోల్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా కూలీని తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఆగష్టు 14న వస్తున్న ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

రజినీకాంత్ పై తనకున్న అభిమానం అంతా కూడా కూలీ రూపంలో చూపించబోతున్నాడు లోకేష్. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను అందుకుంది. లేటెస్ట్ గా వచ్చిన ఈ సాంగ్ కూడా సూపర్ అనేలా ఉంది. కూలీ సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా ఒక స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్దేని తీసుకున్నారు. పూజా బేబ్ అప్పియరెన్స్ ఇంకా గ్లామర్ ట్రీట్ కూలీ ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉన్నాయి.