ఫ్లాప్ వచ్చినా రెమ్యునరేషన్ డబుల్.. లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ ఏంటి?
ఇది వింటే అభిమానులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే, తాను చెప్పిన లియో సినిమా ఫలితం బయ్యర్లకు నష్టాలే మిగిలాయి.
By: Tupaki Desk | 15 July 2025 12:49 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా భారీ చిత్రం కూలీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన శృతి హాసన్, రెబ మోనిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌ను మాత్రం ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే దర్శకుడు ప్రకటించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన లోకేశ్ కనకరాజ్... తన రెమ్యునరేషన్, బడ్జెట్ పరిధిలో వివరణ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 350 కోట్ల నుంచి 400 కోట్ల మధ్యగా ఉండనుందని సమాచారం. ఇందులో రజనీకాంత్‌కు రూ. 150 కోట్లు, లోకేశ్ కనకరాజ్‌కు రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్‌గా ఉన్నట్లు లీకులు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రశ్నించగా లోకేశ్ ఏమాత్రం డౌట్ లేకుండా, అదే తన జీతమని నేరుగా వెల్లడించారు.
"లియో తర్వాత నా రెమ్యూనరేషన్ రెండింతలు పెరిగింది. ఇప్పుడిప్పుడే నేను రూ. 50 కోట్లు తీసుకుంటున్నాను. లియో సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లు కలెక్ట్ చేయడంతో దాని ప్రభావంగా ఇది జరిగింది. మునుపటి సినిమాల కంటే ఇప్పుడు డబుల్ వేతనం వస్తోంది. ఇది డిమాండ్ సప్లై వ్యవహారం. హార్డ్ వర్క్ వల్లే ఇది సాధ్యం. టాక్స్ కడుతున్నాను, కుటుంబాన్ని ఆదుకుంటున్నాను" అంటూ స్పష్టంగా చెప్పేశాడు.
ఇది వింటే అభిమానులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే, తాను చెప్పిన లియో సినిమా ఫలితం బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. భారీ ఓపెనింగ్స్ వచ్చినా, కలెక్షన్లు స్టడీగా కొనసాగకపోవడంతో లియోని బిజినెస్ పరంగా ఫ్లాప్‌గా పరిగణిస్తున్నారు. నిర్మాతలు సేఫ్ అయినా... చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓ డైరెక్టర్ రెమ్యూనరేషన్ డబుల్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.
ఒక్కోసారి ఓ డైరెక్టర్‌కి ఫ్లాప్‌లు వచ్చినా కూడా మార్కెట్‌లో క్రేజ్ పెరిగేలా చేస్తారు. కానీ లోకేశ్ కనకరాజ్ మాత్రం ఫ్లాప్ లెక్కలే లేకుండా, తనకున్న మార్కెట్‌ను తనే కంట్రోల్ చేస్తూ, రెమ్యూనరేషన్‌ను డబుల్ చేసుకోవడం ఖచ్చితంగా ఇండస్ట్రీలో యూనిక్ స్టెప్. ఒక విధంగా కూలి సినిమాకు స్టార్ కాంబినేషన్ కూడా బాగా డిమాండ్ పెంచింది. రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర ఉండడంతో పర్ఫెక్ట్ పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి సినిమా ఏ రేంజ్ లో క్లిక్కువుతుందో చూడాలి.
